భజనకి అంతే లేదు

12 Apr 2016


నవ్వుతారనే సిగ్గు లేదు, జనం ఛీ కొట్టినా తుడుచుకుపోవచ్చనుకుంటారు ఇప్పటి పొలిటీషియన్లు. మరీ ఎన్డీఏ కేబినెట్ మంత్రుల భజనలకు, చిడతలు భారీసంఖ్యలో తయారు చేయించుకోవాలనిపిస్తోంది కూడా. అప్పట్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని మోడీ ఓ దేవదూత అని ఇక జనం దరిద్రం వదిలిపోయినట్లే నంటూ తెగ ఆకాశానికెత్తేశారు. జనాల్లో కనీసం ఒక్కశాతం కూడా ఆ మాటలను నమ్మకపోయినా, కొత్తగా మంత్రిపదవి దక్కింది కదా సిచ్యుయేషన్ అంతే ఉంటుందని సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మరో మంత్రి కూడా నరేంద్రమోడీ పల్లకి మోసే పనిలో పడ్డట్లుంది. 

ఈయనగారు ఇంకో అడుగు ముందుకేసి మోడీతోపాటు, బిజెపి ప్రభుత్వం కూడా దేశానికి దేవుడిచ్చిన వరమంటూ స్వకుచమర్ధనం చేసేసుకుంటున్నారు. ఈ పనికి పాల్పడింది వ్యవసాయశాఖా మంత్రి రాధామోహన్ పదేళ్లలో కాంగ్రెస్ నినాదాలు మాత్రమే ఇస్తే తాము మాత్రం పని చేస్తున్నామంటూ సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. వీళ్లంతా ఇలా మోడీపై పొగడ్తలను భారీగా విసరడంలో కేబినెట్ రీషఫుల్ అంటూ చేస్తే తమ పదవులు పోకుండా ఉండటానికే అంటారు. ఇలా బాకా ఊదే మంత్రులు లేకపోతే మీడియాలో పలుచన అయ్యే ప్రమాదముందని ఎన్డీఏ వ్యూహకర్తల ఫీలింగ్ అట, కాని జనం ఈసడించుకుంటున్న సంగతి మాత్రం వాళ్లకి చేరదా..?
Politicians dont have self respect. They can do any this for that posotion. Now BJP leaders are best example for this. BJP central ministers praising Modi too much.