బిగ్ బి బస్

11 Apr 2016


అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్ ఓల్డ్ మేన్. తనకి  ఎలా వచ్చిందో ఏమో కానీ బిగ్ బి అని ఆయన ఏం చేసినా, ఆ ఇమేజ్ కి తగ్గట్లే స్టాండర్డ్స్ ఉంటాయ్. కోల్ కతాలో టి ట్వంటీ మ్యాచ్ కి సొంత  చార్టర్ లో వచ్చి మరీ నేషనల్ ఏంథెమ్ జనగణమన పాడిన అమితాబ్ బచ్చన్ అందుకు పైసా కూడా తీసుకోలేదని అందరికి తెలిసిందే. తన దేశభక్తిని అలా ప్రూవ్ చేసుకున్న అమితాబ్ ఇప్పుడు మరో రకంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. 

బిగ్ బికి సొంతంగా ఓ ఎయిర్ బస్ ఉందట, అది 260కోట్ల రూపాయల ఖరీదు చేస్తుందట. తాను అనుకున్న కార్యక్రమాలు డిలే కాకుండా ఉండటానికి ఇలా స్పెషల్ ఎయిర్ బస్ అరేంజ్ చేసుకున్నారట బిగ్ బి. నలభైఏళ్లుగా బాలీవుడ్ లో తిరుగులేని ప్రజాదరణ సంపాదించుకున్న అమితాబ్ కు ఇలా సొంతంగా ఫ్లైట్ ఉండటం పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే గిట్టని వాళ్లు ప్రతీదాన్నీ భూతద్దంలో చూపించి ఏదో తప్పు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారని బిగ్ బి ఫ్యాన్స్ తిప్పి కొడుతున్నారు. 

నల్లకుబేరులంటూ పనామా దేశంలో బైటపడ్డ కొన్ని డాక్యుమెంట్లలో బిగ్ బి పేరుండటంతో ఇప్పుడీ ఎయిర్ బస్ వ్యవహారాన్ని కూడా వివాదాస్పదం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఐతే డబ్బు సంపాదించడం తప్పు కాదని అలా ప్రచారం చేసేవాళ్లు గుర్తుంచుకోవాలి. చట్టవ్యతిరేకంగా ఏదైనా ఉంటే సరే కానీ, ప్రతిదాన్నీ ఈకలు పీకడం సరికాదని వాళ్లు తెలుసుకోవాలి.
Bollywood superstar Amitha Bhachan is popular all India over. Now he is in media, in panama list his name is also there. He has a won flight.