పటేళ్లకీ కావాలి రిజర్వేషన్లు

18 Apr 2016


ఇప్పుడంతా రిజర్వేషన్ల సీజన్ పైకి అగ్రవర్ణాలు కానీ, మాకు రిజర్వేషన్లు కావాలంటూ రోడ్డెక్కడం సర్వసాధారణమై పోయింది. గుజరాత్ లో అదే తీరులో పటేళ్లు రిజర్వేషన్లు కావాలంటూ రోడ్డెక్కి, బంద్ కి పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో హార్దిక్ పటేల్ మరోసారి వార్తల్లోకి ఎక్కుతున్నాడు. మెహసానా పట్టణంలో వందల సంఖ్యలో గుమికూడి హార్ధిక్ పటేల్ ను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమయ్లంలోనే పాటీదార్‌ ఆందోళన సమితి కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళన కారులు ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పలువురిపై దాడులకు దిగారు.

ఆందోళన తీవ్రంకావడంతో పరిస్థితులు విషమించకుండా పోలీసులు మెహ్సానా జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలపై కూడా ఆంక్షలు పెట్టారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన కులాలు, వాటి కుంపట్లతో అట్టుడుకుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. చిన్న వయస్సులోనే తన వర్గానికి రిజర్వేషన్లు కావాలంటూ హార్దిక్ పటేల్ రోడ్డెక్కి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రెండో దశ రగడకి అతన్ని లేకుండా చేయడానికి అరెస్ట్ చేశారు పోలీసులు. ఐతే పాటీదార్ ఆందోళన్ సమితి సభ్యులు హార్దిక్ ని రిలీజ్ చేయాలని, రిజర్వేషన్లు ప్రకటించాలని కోరుతూ హింసకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టి బంద్ ఉద్రిక్త పరిస్థితి మధ్య సాగింది.
Gujarat is very hot patel fight for their reservations. Today polices arrested Hardik patel as safe side. So all patels are fighting for Hardik patel and reservations. For safe side polices announced 144 section.