నాలుగు దేశాలు చూసిన పాట

22 Apr 2016


యూట్యూబ్ లో ప్రతీ రోజూ కొన్ని వేల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయ్. వాటిని చూసి ఎంజాయ్ చేసిన వీక్షకుల సంఖ్య తో ఆయా వీడియోల పాపులారిటీ తెలుస్తుంటోంది. ఇప్పుడు దాదాపు 146 కోట్ల మంది ఓ వీడియో సాంగ్ ను చూడటం సెన్సేషన్ కలిగిస్తోంది. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశ జనాభాతో సమానమైన సంఖ్యలో నెటిజన్ల హిట్లు సాధించిన ఆ వీడియో పేరు అడెలె-హలో.. ఇదే ప్రస్తుతం నంబర్ వన్ వీడియో. లాస్టియర్ ఆక్టోబర్ 22న యూట్యూబ్ లో అప్ లోడైన ఆ సాంగ్ మీరూ చూడండి. 

హలో సాంగ్ ను పాడింది అడేల్ అనే బ్రిటిష్ సింగర్, ఇది ఆమె మూడో సింగిల్ ఆల్బమ్ కావడం విశేషం. ఈ సాంగ్ ను ఆమె స్వయంగా రాయడం కూడా విశేషం. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలపై వీడియోలో హీరోయిన్ గుర్తుకు తెచ్చుకుంటూ బాధ పడుతుంటుంది, గతజీవితంలోని తన ప్రేమ, అది విఫలమైన తీరు అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ సాగుతుంది ఈ పాట, ప్రేమ విశ్వవ్యాప్తమైందనడానికి హలో  అనే ఈ సాంగ్ రిలీజైన ప్రతి దేశంలో మంచి రేటింగ్స్ సంపాదించడమే నిదర్శనం. అందుకే యూ ట్యూబ్ లోనూ విపరీతమైన ఆదరణ పొందింది, 145 కోట్ల కి పైగా హిట్లు సాధించింది.
A video got 145 crores hits and got record. Adele Hello video was uploded in last year October. It album maker is Adele and she wrote this.