జంప్ జిలానీలపై అనర్హత వేటు తప్పదా..?

1 Mar 2016                           ఖచ్చితంగా పద్దతి ప్రకారం జరిగితే, ఇప్పుడు ఎవరైతే నియోజకవర్గాల అభివృధ్ది పేరుతో పార్టీలు మారుతున్నారో వారందరిపై అనర్హత వేటు పడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. వైఎస్ జగన్ దయ ఉంటే తప్ప పార్టీ పారిన జంపింగ్ జపాంగ్ ల ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయంగా చెప్తున్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైఎస్సార్సీపీ ఎప్పట్నుంచో అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్తున్నారు దానికి ఇప్పుడు టైమ్ వచ్చిందంటున్నారు. జగన్ కూడా గతవారం ఇదే అంశం చెప్పారు. పాయింట్ నంబర్ వన్..వైఎస్ జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ పై నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తారు. అది స్పీకర్ తన విచక్షణ ఉపయోగించి హోల్డ్ లో పెట్టొచ్చు కానీఇప్పటికే తమ నోరు నొక్కుతున్నారని విపక్షం వాదన విన్పించడానికైనా ఆయన పర్మిషన్ ఇవ్వకతప్పదు. బడ్జెట్ సెషన్స్ పూర్తయ్యేలోపు తీర్మానం చర్చకు వస్తే, తీర్మానం స్పీకర్ కు అనుకూలంగానే ఫలితం వస్తుంది. ఆయన పదవికి ఎలాంటి ఢోకా  ఉండదు కానీ ఇప్పుడెవరైతే పార్టీ మారి తెగ డెవలప్ మెంట్ మూడ్ లో ఉన్నారో వారందరికీ చిక్కులు తప్పవు. తమ పార్టీ సభ్యులందరికీ వైఎస్సార్సీపీ విప్ జారీ చేస్తుంది. అప్పుడు ఆ అవిశ్వాస తీర్మానం సందర్భంగా తప్పనిసరిగా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఓటేయాల్సిందే. వేరే మార్గం లేదు అలా చేస్తే వారంతా టిడిపిలోకి మారినా వైసీపీలో కొనసాగినట్లే. ఇది జనం దృష్టిలో వారికి పడిపోయిన ఇమేజ్ ను ఇంకాస్త పడేస్తుంది..


                          పాయింట్ నంబర్ 2  విప్ ను కాదని ఈ ఎమ్మెల్యేలంతా స్పీకర్ కు అనుకూలంగా ఓటేస్తే, స్పీకర్ కు మెజార్టీ పెరుగుతుంది తప్ప ఫలితంలో మార్పుండదు. కానీ జంప్ జిలానీల శాసనసభ్యత్వం రద్దవకతప్పదు. ఇక్కడ కూడా రాజకీయాలు ప్లే చేసి స్పీకర్ విచక్షణాధికారం ప్రకారంవారిపై నిర్ణయం పెండింగ్ లో పెడితే అది స్పీకర్ ఛైర్ పై ఇప్పటికే ఉన్న ఆరోపణలను ఎక్కువ చేసినట్లవుతుంది. దానిపై వైఎస్సార్సీపీ కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా ఎడ్జ్ వైఎస్ జగన్ కే ఎక్కువ ఉంటుంది. అంటే ఇలా కూడా ఆ ఫిరాయింపుగాళ్లకు చిక్కులు తప్పవు.

               పాయింట్ నంబర్ 3 ఓ వేళ నిజంగా రూల్స్ ప్రకారం ఎమ్మెల్యేలు అనర్హులైతే, బై ఎలక్షన్లు తప్పవు. ఎంత సాగదీసినా ఏడాదిలోపు వస్తాయి. అంటే వీరందరూ ధైర్యంగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లకుండా, బలవంతంగా పదవులు కోల్పోయిన స్థితిలో ఎన్నికలను ఎదుర్కోవాలి దానికి టిడిపి తరపున ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా కూడా నిధులు సమకూర్చుకోవాలి ఈ సిచ్యుయేషన్ ఎదుర్కోలేకే అసలు రాజీనామాలు చేయడం లేదంటున్నారు. అంటే వద్దన్న స్థితిని కొని తెచ్చుకోవడమే. పైగా జగన్ యాటిట్యూడ్ లో మార్పేం లేదు, ముందు నుంచీ చెప్తున్నట్లుగా ఐదారుగురు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన కొత్తగా వచ్చే నష్టమేం లేదన్నది ఆయన భావన అంటున్నారు. అలాంటప్పుడు బై ఎలక్షన్స్ లో ఫలితం ఆయనపై ఎలాంటి ప్రభావం ఉండదు. అదే టిడిపి తరపున బరిలో దిగాల్సి వచ్చినప్పుడు వీరికి ఓటమి ఎదురైతే అనవసరంగా మూడేళ్లకి ముందే మాజీలుగా మారాల్సి వస్తుంది.

               పాయింట్ నంబర్ 4..పైన చెప్పిన ఈక్వేషన్స్ అన్నీ కేవలం వైఎస్ జగన్ వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన పెట్టిన పార్టీలో చేరి గెలిచిన వారంతా ఇప్పుడు అభివృధ్ది అనే సాకుతో బైటపడుతున్నప్పుడు, అనర్హులుగా మారాలా వద్దా కూడా ఆయన దయతోనే ముడిపడి ఉండటం గమనించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు అందరి చూపూ జగన్ వైపే ఉంది. ఎస్ జగన్ ఇప్పుడేం చేయబోతున్నావ్ అంతా నీపైనే ఆధారపడి ఉంది.
Few days back some of the YSRCP MLAs jumped into to TDP. But what will be their future, is depending on YS Jagan.