విడాకుల్లేకుండా విడిగా..!

28 Mar 2016


చలఛయ్యఛయ్యఛయ్యా అంటూ షారుఖ్ ఖాన్ తో ట్రైన్ పై ఆడి పాడిన ముదురు బ్యూటీ మలైకా అరోరా ఖాన్ ఆ తర్వాత హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు కానీ, సెక్సీనెస్ కి సింబల్ గా తన స్టేటస్ ని అలానే మెయిన్ టైన్ చేసింది. మన మహేష్ బాబుతో అతిధి సినిమాలో రాత్రైతే నాకు ఓకే..పగలైతే నాటోకే..! అంటూ ఓ పాటలో మెరిసింది కూడా కాలక్రమంలో మలైకా అరోరా, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ని పెళ్లాడి, మలైకా అరోరాఖాన్ గా మారింది. హ్యాపీగా కాపురంతో పాటు, సినిమాల ప్రొడక్షన్ కూడా మొదలెట్టేశారు. దబంగ్ మూవీలో మరిదితో మాంఛి ఊపుమీద స్టెప్పులేసిన మలైకా ఆ తర్వాత మొగుడు ఆర్భాజ్ తో పొరపొచ్చాలు రావడంతో, కలహాలకాపురాన్ని కంటిన్యూ చేసింది. 

ఐతే ఈ మధ్య కాలంలో వీరిద్దరికీ అసలు పడని పరిస్థితి తలెత్తడంతో ఇక గుడ్ బై చెప్పుకుంటే కనీసం ఫ్రెండ్స్ గా అన్నా మిగిలి ఉంటాం అని డిసైడయ్యారు. మధ్యలో సల్మాన్ ఖాన్ మధ్యవర్తిత్వం నడిపినా, కలిసుండేందుకు వీలు పడ్లేదట. ఐతే ఈ మధ్యలో జరుగుతున్న ప్రచారంపైనే మండిపడ్డారు ఈ హాట్ కపుల్. విడిపోవాలనుకున్నమాట నిజమే కానీ విడాకుల కోసం అప్లై చేయడం కానీ, లాయర్ ని సంప్రదించడం కానీ ఏమీ చేయలేదని చెప్పొచ్చారు ఈ ఇద్దరూ. మా కుటుంబానికి ఏది మంచిదనిపిస్తే అది చేస్తాం కానీ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ప్రచారం చేయొద్దని, ప్రస్తుతానికి తాము విడిగా ఉంటున్నామని అనౌన్స్ చేసేశారు.
Bollywood heroin Malika Arrora Khan is now doing production in Bollywood. She got marriage with Salman Khan brother Arbaj Khan. Now they both are living separately.