విప్ కత్తిపై పచ్చ కథనాలు

28 Mar 2016ఏపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం వీగిపోవడంపై ఓ దమ్మున్న పత్రిక రకరకాల కథనాలు వండుకుంటోంది. బుర్రున్నోడెవడైనా అవి నెగ్గుతాయనుకుంటాడా సాక్షాత్తూ జగనే ఇది స్పీకర్, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తెలియజెప్పేందుకు పెడుతున్నామే తప్ప, నెగ్గేందుకు కాదని చెప్పేశాడు. జంప్ జిలానీల తోక కట్ చేయడానికే వాటిని వాడుకున్న సంగతి కూడా క్లియర్ ఐనా అక్కడికేదో వైఎస్సార్ కాంగ్రెస్ ఫెయిలైనట్లు కథనాలు రాసుకున్నారు. విప్ జారీ చేసినా విలువ లేకుండా పోయిందని ఇవాళ్టి పత్రికలో రాసుకున్నారు. దానికి విలువ లేకుండా చేసిందెవరు? ఓ పార్టీ తరపున ఎన్నికై మరో పార్టీ కండువా కప్పుకున్నవారిపై న్యాయంగా వ్యవహరించే సభాధిపతి ఖచ్చితంగా వేటేయాలి, కానీ చట్టంలోని బొక్కలు అడ్డుపెట్టుకుని బైటపడుతున్నారని సాక్షాత్తూ సుప్రీంకోర్టే వాపోయిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవాలి. అలాంటప్పుడు ఫిరాయించిన 8మంది దర్జాగా తిరుగుతున్నారు. 

అందుకే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ ఆఫీస్ పై దాడి కూడా అలా కడుపుమండే చేశారు జనం. అలాంటిది రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారికి నిజం తెలీదా ఎలాగైనా జగన్ ఆ 8మందిపై వేటేసేందుకు ప్రయత్నిస్తున్నారని కథనం రాసుకున్నోళ్లకి పార్టీ అధినేతగా చంద్రబాబు చేయలేని పనిని, జగన్ చేస్తున్నందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారేమో అని సందేహాలు కలుగుతున్నాయ్. ద్రవ్యవినిమయ బిల్ పై చర్చ కోరడం, ఓటింగ్ కోరడం తప్పెలా అవుతుందో మరి..! ఐతే ఇవాళ రేపట్లో ఇలాంటి కథనాలు ఇంకా వస్తాయేమో అసలు ఎప్పుడూ ఇలా ఓటింగ్ కోరలేదు, ఇలా జరగలేదు అంటూ తమ ఏడుపు గొట్టు స్టోరీలకు పదును పెడతారని ఇప్పటికే వాటి లైన్ అర్ధమైపోయింది.
YSRCP is getting ready to pass VIP on jumped MLAs. But TDP government and some yellow media is writing wrong comments on this.