టిడిపి ఖాళీ..సత్తా చాటిన వైఎస్సార్సీపీ

10 Mar 2016


                                బడ్జెట్ సెషన్స్ లోపే తెలంగాణ టిడిపిని ఖాళీ చేయాలని తెలంగాణ సిఎం కేసీఆర్ టార్గెట్ కి చాలా దగ్గరకి వచ్చేసినట్లే, ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ కొడతారట. వారిలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాద్, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య పేర్లు విన్పిస్తున్నాయ్. వీరిలో ఇద్దరు ఓటుకునోటు కేసులో ఇరుక్కున్నారని, అందుకే జంపవడం ద్వారా బైటపడే దారులు వెతుక్కుంటున్నారని టాక్. అదే జరిగితే ఈ ఎమ్మెల్యేల పరువుతో పాటు, టిడిపి పరువు కూడా గంగలో కలవడం ఖాయం. సిగ్గులేకుండా ఓపార్టీ తరపున  గెలిచి మరో పార్టీలో చేరుతున్న వీళ్లు టిడిపి ఆటలో అరటిపళ్లో లేక, వాళ్ల నైజమే అంతనో తెలీదు. ఇక దీంతో టిడిపికి రేవంత్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య తప్ప మరో దిక్కు లేదు. వీళ్లలో కృష్ణయ్య తీరే వేరు, ఏకోనారాయణలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పైరవడం తప్ప సుఖం లేదని జోకులు కూడా పేలుతున్నాయ్ అప్పుడే..!

                          ఇంకో విషయం ఖమ్మం కార్పొరేషన్  ఎన్నికల్లో నంబర్ వన్ బిజెపి అయితే, టిడిపి వేల్యూ అపరిమితంగా మారిపోయింది. అంటే బిజెపికి దక్కింది ఒక్క వార్డు, టిడిపి సున్నా, వైఎస్సార్సీపీకి మూడు వార్డులు దక్కడం గమనార్హం. తన బలం ఎక్కడుందో అక్కడే పోటీ చేసి గెలుపొందడం వైసీపీ పార్టీ వ్యూహం సక్సెస్ అయిందనడానికి నిదర్శనం.
Yesterday Khamam Municipal elections results was declared. In this results BJP got one seat and TDP has no seats. YSRCP got four seats. That is YSRCP, it know were to participate.