పార్టీ పెట్టి ఐదేళ్లైంది..

12 Mar 2016


                                    వైఎస్సార్సీపీ కార్యాలయంలో జెండా పండగ జరిగింది. ఏపీ విపక్షం వైఎస్సార్సీపీ పుట్టి నేటికి ఐదేళ్లైంది. వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ వీడారు వైఎస్ జగన్, పార్టీ వీడటమే తడవుగా కేసులు పెట్టాయ్ కాంగ్రెస్, టిడిపిలు. ఆ సమయంలోనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. పూర్తి పేరుగా కాకుండా తండ్రి పేరుతోనే పార్టీని పాపులర్ చేయడంలో యువనేత వైఎస్ జగన్ సూపర్ సక్సెస్ అయ్యారు. ఆరోపణలతో సంబంధం లేకుండా పార్టీని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో సింగిల్ హ్యాండ్ గా పని చేశారు జగన్, మధ్యలో కష్టకాలంలో తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల అండతో వైఎస్సార్సీపీ మోస్ట్ హ్యేపెనింగ్ పార్టీగా ప్రజల మదిలో నిలిచింది.

                        పార్టీ ఆవిర్భావం ఐదేళ్ల ప్రస్థానంలో అంతటా తానే నడిపించారు జగన్. ఓ సినిమాటిక్ సన్నివేశాలెన్నో ఈ క్రమంలో చోటు చేసుకున్నాయ్. సిబిఐ కేసు పెట్టడం, 89 రోజులవరకూ ఛార్జీ షీట్ వేయకుండా వేధించడం, జైలుకి పంపడం అందరికీ తెలుసు. మధ్యలో విచారణకు కోర్టుకు వచ్చినప్పుడల్లా ఆయన విజువల్స్ చూపడం కోసం ఛానల్స్ పడ్డ ప్రయాస, ఆత్రం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. విభజన సందర్భంగా జరిగిన పరిణామాలతో పాటు, వైఎస్ జగన్ విడుదల కూడా ఓ సంచలనమే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్టీలో సర్దుబాటుకు సూచనగా మిగిలితే ప్రస్తుతం ప్రత్యేక హోదా, పోలవరం సాధన ఎజెండాగా వైఎస్సార్సీపీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. పార్టీనుంచి ఎమ్మెల్యేలు వలసపోవడం ఈ ఏడాది పరిణామం కాగా, దాన్ని జగన్ లైట్ తీసుకుని రేపటి అవిశ్వాసంపై వ్యూహం పన్ని చతురత చాటుకున్నట్లే భావిస్తున్నారు. బై ఎలక్షన్లతో సత్తా చాటిన వైఎస్సార్సీపీ ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ కీ సిధ్దమయ్యే ఈ నో కాన్ఫిడెన్స్ వ్యూహం పన్నిందని చెప్పాలి. ఐదేళ్ల  ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసిన పార్టీ ఇప్పుడు కీలక మలుపులో ఉంది. అదెటు దారి తీస్తుందో మరి కొన్ని రోజుల్లో తేలబోతోంది.
It was five years passed away that YSRCP party started. Today in YSRCP party office YS Jagan celebrated fifth anniversary.