విప్ కత్తి తప్పదా

27 Mar 2016


ఏపీ అసెంబ్లీలో జంపైన జిలానీలపై వేటేయించేందుకు వైఎస్సార్సీపీ పావులు బలంగా కదుపుతోంది. రెండు అవిశ్వాస తీర్మానాల సందర్భంగా అధికార పక్ష వైఖరితో ఫిరాయింపుదార్లపై వేటు తప్పించుకున్నా. ఈసారి మాత్రం వేటు పడేలా వ్యూహం రచించింది. ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ దీనికి వేదిక చేసుకోబోతోంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేల‌కు మార్చి 29, 30 న జరిగే చర్చలో పాల్గొనాలని, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ విప్ జారీ చేసింది. వారికి అందినట్లు సంతకాలు కూడా తీసుకుంది. 

విప్ తీసుకున్నవారిలో  భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ‌, మ‌ణిగాంధీ ,ఆదినారాయ‌ణ రెడ్డి, జ‌య‌రాములు, జ‌లీల్ ఖాన్, క‌ల‌మ‌టి వెంక‌ట‌ర‌మ‌ణ‌, డేవిడ్ రాజ్ ఉన్నారు. దీంతో ఈ ఎనిమిది మందీ 29, 30 తేదీల‌లో స‌భ‌కు హాజరు కావాలి. అలానే ద్రవ్యవినిమయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ ప్రకారం ఓటు వేయాలి. అప్పుడిక ఈ జంప్ జిలానీలపై వేటు పడక తప్పదనే అభిప్రాయంలో వైఎస్సార్సీపీ ఉంది. రెండుసార్లు ఏదోలా తప్పించుకున్నా, ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాత్రం చేజారిపోకుండా విప్ కత్తికి బలవుతారనే అభిప్రాయం విన్పిస్తోంది.
YSRCP is getting ready to move vipe on jumped MLAs. In budget due to no confidence motion, it is not possible. In next session it is getting ready.