రోజా సరైన ప్రశ్నే అడిగిందా

3 Mar 2016                     ఏపిడిప్యూటీ సిఎం కేఈ కృష్ణమూర్తి తనకి ఆగ్రహం  తెప్పించబట్టే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుంటున్నామని చెప్పారు రెండ్రోజుల క్రితం, మరిప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సరిగానే అడిగిందా అని జనం  అనుకుంటున్నారు. రెవెన్యూ మంత్రి ప్రమేయం లేకుండా సిఆర్డీఏ పరిధిని నిర్ణయించడం, ఆ పరిధిలో భూములు లాక్కోవడం ఎందుకని రోజా అడిగారు. అసలు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే మంత్రి నారాయణతో కమిటీ వేసి రాజధాని నిర్ణయం ఎలా తీసుకోగలిగారని ప్రశ్నించారామె. మరి ఇవి జవాబు చెప్పుకోవాల్సిన ప్రశ్నలే మరోవైపు రాజధానిలో పనులు జరగడం లేదనే ఉద్యోగులను విజయవాడకు పిలుస్తున్నారా లేక రియల్ ఎస్టేట్ భూముల ధర పెంచాలనా అని కూడా రోజా చంద్రబాబును నిలదీశారు. 

                   దళితుల భూములు అస్సైన్డ్ లాండ్స్ ఎలా కొంటారని ప్రశ్నించిన రోజా వాదనలో నిజం ఉందో లేదో చూడకుండానే ఓ పార్టీకి అంటగట్టేయడం కుదరదని అంటున్నారు. భూములు కొనడం తప్పని  ఎవరూ  అనరు మరి ఆస్సైన్డ్ లాండ్స్ కొనుగోలు చేశారని సాక్షి పత్రిక కథనం దానిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారే కానీ ఎంక్వైరీ చేయించుకోవాలని ఎందుకు మంత్రులు అడగలేకపోతున్నారో తెలీదు. ఓ వేళ అస్సైన్డ్ లాండ్స్ ఉన్నట్లైతే వాటిని ప్రవేట్ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు కొన్నట్లైతే వాటిని రద్దు చేయాలనే డిమాండ్ వస్తుంది ఇది సమంజసమే కదా.
YSRCP MLA Roja questioned TDP leaders about attracting MLAs. She asked about TDP governemt GOs and implementations.