పట్టిసీమపై కబుర్లు

30 Mar 2016


పట్టిసీమను రికార్డు స్థాయిలో టైమ్ కి పూర్తి చేసామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ పేరుతో 1600 కోట్లు నాశనం చేశారని మండిపడ్డారు జగన్. ఏపీ అసెంబ్లీలో ఈ అంశంపై ఆసక్తికర చర్చ సాగింది. పట్టిసీమలో స్టోరేజ్ లేకుండా ప్రాజెక్టు పూర్తైందని చెప్పడం ఏంటని ఎద్దేవా చేశారు జగన్. ఈ సందర్భంగా జగన్ చంద్రబాబుది తెలిసీ తెలియన జ్ఞానమని చెప్పారు. ఐతే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రిజర్వాయర్ అవసరం లేదని, కాల్వలతోనే కృష్ణాడెల్టాకి, రాయలసీమకి నీళ్లు వెళ్తాయని చెప్పారు. ఈ రెండు వాదనల్లో నిజమెంతో తేలాల్సి ఉంది.

కృష్ణా డెల్టాకి 180 టిఎంసీలు అవసరమైతే పట్టిసీమ కెపాసిటీనే 4 టిఎంసీలని అలాంటప్పుడు మీరు చెప్పిన డెల్టా పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందని కడిగిపారేశారు జగన్. ఈ ప్రాజెక్టు పేరుతో 1600 కోట్లు రూపాయలు వృధా ఖర్చు చేసి పోలవరాన్ని పక్కనబెట్టారని మరోసారి విమర్శించిన జగన్ వాదనపై ప్రస్తుతానికి జనంలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే పట్టిసీమ కట్టబెట్టిన మెగా ప్రాజెక్టు కి ఇప్పటికే డెడ్ లైన్ కి పూర్తి చేసారంటూ 200 కోట్లు బోనస్ ఇచ్చారని అంటున్నారు. అసలు ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులో లాభం చూసుకునే కంపెనీలకు ఇలా టైమ్ కి కట్టినందుకు బోనస్ లు ఇస్తూ పోతే అదే అలవాటు కాదా, ఓ వేళ అదే సరైనది అయితే మరి ఆలస్యం చేసిన ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకి పైన్లు కూడా వేయాలనడం కూడా ఆలోచించాలిగా!
AP Government is saying we have constructed Patti seema project. But YS Jagan is saying Patti seema is not useful with out storage.