నిజంగా ఫైబర్ ఆప్టిక్ అందుకేనా

27 Mar 2016


ఏపీ ప్రభుత్వం జూన్ నుంచి మొదలు పెడాతామంటున్న ఫైబర్ ఆప్టిక్ లైన్ టిడిపి వాయిస్ విన్పించేందుకే అని జగన్ ఆరోపించడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. 150రూపాయలకే ఇఁటింటికి ఇంటర్నెట్ కేబుల్ టీవీ అంటే మామూలుగా మంచి విషయమే, జనానికి వినోదం విజ్ఞానం అనే అనుకుంటారు. ఐతే విపక్షనేత జగన్ ఏమంటారంటే, తమకి వ్యతిరేకంగా ఏదైనా ఛానల్ వార్తలు ప్రసారం చేస్తే ఈ ఆప్టికల్ లైన్ ద్వారా వాటి ప్రసారాలు నిలిపివేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎప్పుడో బ్లాక్ లిస్ట్ లో పెట్టిన టెరా సాఫ్ట్ కి కాంట్రాక్ట్ అప్పగించడమే ఇందుకు నిదర్శనమని జగన్ వాదన. ఐతే చంద్రబాబు మాత్రం టెండర్లు పిలిచామని, లెస్ కోట్ చేసిన సంస్థకే ఇచ్చామని వాదిస్తున్నారు. ఐతే టెండర్ల భాగోతం తెలీనిది ఎవరికని కూడా విమర్శలున్నాయ్. ఐతే ప్రజాస్వామ్యంలో ప్రతీ టీవీ ఏదోక టైమ్ లో అధికార పక్షానికి వ్యతిరేకంగా వార్తలు రాయాలని రాయరు. నిజమైతే రాయొచ్చు అలాంటి వార్తలను ఆపాలని చూసినా, ఆగేవి కాదు. ఐతే ఇదే సమయంలో ప్రతిపక్షనేత ఆందోళనలోని వాస్తవికతను కూడా అర్ధం చే సుకోవాల్సిన అవసరం ఉందని కొందరంటున్నారు. 
AP CM Chandrababu Naidu is telling, we will give optical fibre internet connection to all houses for 150 pre month. But YSRCP Leader YS Jagan comment on internet connections.