ప్రత్యేక హోదాకి ఫుల్ సపోర్ట్

17 Mar 2016                                 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కోసం ఇవాళ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఐతే చంద్రబాబు తీరుని నిరసిస్తూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం తీర్మానానికి మద్దతు ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు, ప్రశ్నలు సంధించారు. సీఎం చంద్రబాబు నాయుడు చిత్త శుద్ధిపై తమకు నమ్మకం లేకపోయినా మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ఈ కింద ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.

                                   రెండేళ్లక్రితం ఏం చెప్పారో, ఇప్పుడు కూడా అవే చెప్తున్నారు. ఈ తీర్మానంపై కేంద్రం స్పందించకపోతే మీరేం చేస్తారు..? ఇక్కడ బీద అరుపులు, ఢిల్లీలో పొగడ్తలెందుకు? చేతనైతే కేంద్రంపై విమర్శలు చేసి ఒత్తిడి పెంచరెందుకు? నెలరోజుల్లో కేంద్రసాయం రాకపోతే కేంద్రమంత్రివర్గంలోని మీ ఎంపిలను తప్పుకొమ్మని చెప్తారా..? ఈ ప్రశ్నలు వైఎస్ జగన్ అసెంబ్లీలో అడుగుతుండగా, అడ్డుకునేందుకు టిడిపి సభ్యులు ప్రయత్నించారు. అంతేకానీ వాటికి సమాధానం మాత్రం చెప్పలేదు.
Yesterday Chandrababu Naidu introduced a motion on Andhra Pradesh special status. To this motion YS Jagan gave support.