అనుకున్నట్లే నాట్ బిఫోర్

14 Mar 2016                              అదే తరహా, అదే తీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసులు విచారణకు వచ్చినప్పుడు జరిగిన పరిణామాలే ఇప్పుడు కూడా రిపీటవుతున్నాయ్. అప్పట్లో జగన్ కి బెయిల్ రాకుండా చేసేందుకు, కేసు విచారణ త్వరితగతి కాకుండా చేసేందుకు, కొంతమంది నాట్ బిఫోర్ అంటూ జడ్జిలు విచారణ తప్పించుకున్నారు. ఎందుకంటే తమ ప్రాంతాలకు చెందిన కేసులలో పక్షపాతం చోటు చేసుకునే అవకాశం ఉందన్న కారణంతో ఆ  జడ్జిలంతా నాట్ బిఫోర్ మీ అంటూ వాటి విచారణ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు స్పీకర్ విచక్షణతో  ఏడాది పాటు అసెంబ్లీనుంచి సస్పెండైన ఏపీ ఎమ్మెల్యే రోజా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. 

                 ఇక్కడ  కూడా  అదే పరిణామం సంభవించింది, జడ్జి ఎన్వీరమణ కేసు విచారణకు విముఖత చూపించి మరో బెంచ్ కు బదిలీ చేశారు. దీంతో విచారణ వాయిదా పడింది ఇలా నాట్ బిఫోర్ అనే ప్రక్రియ కూడా ఏపీలోనే జరుగుతుందని. ఇంకే  రాష్ట్రానికి సంబంధించిన న్యాయమూర్తులు ఇలా కేసు విచారణనుంచి తప్పుకున్న దాఖలాలు లేవని న్యాయనిపుణులు చెప్తున్నారు. సత్వరన్యాయం కోసం ఎదురుచూసే పిటిషనర్లకు ఇలాంటి నాట్ బిఫోర్ ఉదంతాలు విచారణలో మరింత జాప్యం చేస్తుందని వాపోతున్నారు.
AP TDP leaders are showing politics in court also. Present in Roja suspension case and Once upon a time in YS Jagan case.