లండన్ టూర్ అందుకేనా?

6 Mar 2016                      అటు దేశ  బడ్జెట్ లో ఊసేలేని ఏపి ప్రాజెక్టులు, ఇటు రాజధానిలో భూముల రగడ, మరోవైపు బడ్జెట్ ఇలా మూడు వైపులనుంచి దాడి తట్టుకోలేకే ఏపి సిఎం చంద్రబాబు విదేశీ పర్యటన పెట్టుకున్నారా అన్పించకమానదు. వీటికి తోడు ఇప్పుడు రావెల కిషోర్ బాబు కొడుకు నిర్వాకం కూడా బైటపడటంతో టిడిపి ప్రభుత్వం పెద్ద సూప్ లో పడిపోయిందనే విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే తప్పించుకుని తిరిగితే కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితినుంచి తప్పించుకున్నట్లవుతుందని చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది. 

                     అసలు బడ్జెట్ ప్రవేశపెట్టీ  పెట్టగానే లండన్ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు వెళ్లాల్సిన అవసరం లేదు, అది ఎటూ 13వ తారీఖు వరకు జరిగే సదస్సని చెప్తూనే ఉన్నారు. అంతగా అయితే 11 వతేదీనో, లేదంటే 12నో వెళ్లొచ్చు ఐనా బాబు ఇలా లండన్ టూర్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా పలాయన మంత్రమే అంటున్నారు. పైగా చంద్రబాబునాయుడు వెంట మున్సిపల్ శాఖామంత్రి నారాయణ, ఆర్ధికమంత్రి యనమల వెళ్లాల్సిన అవసరం ఏంటో తెలీదు, ఎందుకంటే గతంలో ఐటీశాఖ, లేదంటే సమాచార శాఖ వాళ్లు మాత్రమే వెళ్లిన చోటకి ఈ ఇద్దరు మంత్రులు వెళ్లి ప్రయోజనం ఏంటనే ప్రశ్న తలెత్తకమానదు. బడ్జెట్ పై సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే యనమల కూడా జంపవుతున్నారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయ్.
AP CM Chandra Babu is planing to London tour. Recently Central government introduced Union Budget 2016. In this no extra fund is released to AP. So escape from this situation CM planed London.