ఎవరు కడతారో చెప్పాలి

17 Mar 2016


                          ఏపీ కి ప్రత్యేక హోదా ఖచ్చితంగా రాదు. అది కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారే అది ఇవ్వాలి, ఇది కన్పామ్ అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఎవరు కావాలంటే వారు అవతలివారిపై విమర్శలు, ఆరోపణలు చేసుకోవచ్చు. ఐతే దాంతో పాటు మరో పెద్ద ప్రాజెక్టుకు కూడా ఇప్పుడు కేంద్రం మంగళం పాడుతుందా, లేక టిడిపినే అందుకు ఆజ్యం పోస్తుందా అన్నదే తెలియాల్సి ఉంది. అదే పోలవరం ఇది నిజంగా పూర్తైతే ఎంత మందికి ఎలా ఎన్నిరకాలుగా ఉపయోగపడుతుందో తెలీదు కానీ రాజకీయంగా మాత్రం ఉపయోగపడుతోంది.
అసెంబ్లీలో ఎపి సిఎం చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో ఉందన్నారు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 645 కోట్లు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం 1449 కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు చెప్పారు. ఐతే ఈ అంశంపైనే బిజెపినేతలు, టిడిపి నేతలు క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. 

                         కేంద్రం ఇచ్చిన నిధులను టిడిపి పట్టిసీమకి ఎందుకు వాడిందో చెప్పాలని మాజీ కేంద్రమంత్రి పురంధీశ్వరి క్వశ్చెన్ రైజ్ చేయగా, చంద్రబాబు  అసెంబ్లీలో ఇప్పటికిప్పుడు కేంద్రానికి ట్రాన్స్ ఫర్ చేస్తాం సిద్దమేనా అని అసహనం వ్యక్తం చేశారు. అంటే ఈ రెండు వ్యవస్థల మధ్యా ఖచ్చితంగా గ్యాప్ ఉంది. సరే ఆ గ్యాప్ ఎలాగూ ఎన్నికల ముందు పెద్దదవడమో, పూడటమో జరుగుతుంది కానీ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావాల్సిన నిధుల గ్యాప్ మాత్రం ఎలా పూడుతుందో ఇకపై తెలియాల్సి ఉంది. ఎందుకంటే పోలవరం నిర్మాణానికి దాదాపు 30 వేలకోట్లు కావాలి. మరి కేంద్రం రాష్ట్రం కేటాయించుకుంది రెండువేల కోట్ల చిల్లర అంటే ఇంకా 27వేల కోట్లు కనీసం అవసరం అవుతుంది. మరి 2018కి పూర్తవుతుందా మెడకాయ్ మీద తలకాయ్ ఉన్నోడెవడున్నా దీన్ని నమ్ముతాడా.
BJP government in central is not giving clarity on AP Special status. Not giving funds to Polavaram project. State government used Polavaram fund to Pati Seema.