కింగ్ నే ..కింగ్ మేకర్ ని కాను

11 Mar 2016


                       తమిళనాడులో ఇప్పుడు విజయ్ కాంత్ హవా నడుస్తోంది. పదేళ్లపాటు ఎదురు చూసిన శ్రమకి ఫలితం దక్కే సూచనలు కన్పిస్తుండటంతో కెప్టెన్ ఝూలు విదిలిస్తాడని అంటున్నారు. అందుకే నేషనల్ పార్టీలతోపాటు డిఎంకే పొత్తు పెట్టుకునేందుకు సిధ్దంగా ఉన్నా, మనోడు అవసరం లేదు పొమ్మన్నాడు. నేను కింగ్ నే తప్ప కింగ్ మేకర్ ని కాదంటూ తేల్చేశాడు. దీంతో డీఎండీకే పార్టీ మద్రాసు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లైంది. ఐతే కెప్టెన్ మిగిలిన  పార్టీలపై అప్పర్ హ్యాండ్ కోసమే ఇలా చేస్తున్నాడంటారు. దాన్ని కూడా కొట్టిపారేశాడు కెప్టెన్, ఖచ్చితంగా ఈసారి సిఎం అవుతానని విజయ్ కాంత్ ఆశలు పెట్టుకున్నాడు. పైగా అన్ని పార్టీలు అతనితో దోస్తీ కోసం ప్రయత్నించినట్లు బాహాటంగానే తెలియడంతో ఓటర్లకు మనోడిపై సాఫ్ట్ కార్నరే ఏర్పడబోతోంది. సో ఇక  ఎన్నికల క్షేత్రంలో ప్రచారం బాగా జరిగితే చాలు మనోడికి పీఠం దక్కడం ఇక భగవంతుడి చేతిలోనే ఉంటుంది.

                       అంతకు ముందు  బిజెపి సూపర్ స్టార్ రజనీని దువ్వి భంగపడే కంటే, ఆల్రెడీ రంగంలో ఉండి పేరు తెచ్చుకున్న విజయకాంత్ కి మద్దతిస్తే ఇద్దరికీ లాభం దక్కుతుందనే వ్యూహం పన్నింది. ఐతే ఇప్పుడు విజయ్ కాంత్ క్లారిటీ ఇవ్వడంతో ఇక ఆ పార్టీకి నిరాశే మిగులుతుంది. మరోవైపు ముసలి నేత కరుణానిధి నేతృత్వంలోని డిఎంకేలో లుకలుకలతో కెప్టెన్ ఫ్రెండ్షిప్ కోసం చేయి సాచాడు. ఆయనకీ హ్యాండివ్వడంతో డిఎంకే ఇక దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
Now Tamilnadu all parties are waiting for Vijayakanth. Rajanikanth declared i dont have interest in politics. So next time Vijaykanth will be CM.