తెలుగు కథలెందుకు రీమేకులుండగా

7 Mar 2016                        మరో తమిళ సినిమాపై మనసు పారేసుకున్నాడట మన వెంకీ బాబు యమా ఫాస్ట్ గా సినిమాలు ఒప్పేసుకుంటున్న వెంకటేష్ తెలుగు కథలు స్ట్రెయిట్ కథలు అంటే పెద్దగా పట్టించుకోవడం లేదు. సాలాఖద్దూస్ రీమేక్ కి ఓకేచెప్పిన వెంకీ, ఇప్పుడు తమిళంలో రిలీజైన సేతుపతిని కూడా తానే తీద్దామని డిసైడయ్యాడట. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, దృశ్యం సినిమాతో ఫామ్ లోకి వచ్చిన వెంకీ ఆ తర్వాత కూడా సక్సెస్ బాటలో ఏం పయనించలేదు. ఐతే తానింకా రేసులో ఉన్నట్లే అని ప్రూవ్ చేస్కున్నాడు.
 
                     ఇప్పుడు మారుతి అనే యువదర్శకుడి తో బాబు బంగారంలో నటిస్తూ సాలా ఖద్దూస్ రీమేక్ కి ఓకే చెప్పాడు. ఇది తొందర్లోనే తెరకెక్కబోతోందట, అలా రెండు సినిమాలు లైన్లో పెట్టేసిన వెంకీ మూడో సినిమా కూడా డిసైడ్ చేసేశాడు. తమిళ్ లో విడుదలైన  సేతుపతి అనే మూవీ బాగా నచ్చడంతో అది కూడా రీమేక్ చేద్దామనుకుంటున్నట్లు టాక్.
Tollywood family heroin Venkatesh started his second innings with Sithama Vakitlo Siri Malle chetu. Later he gets hits. And he is doing almost all tamil remake movies.