తులసిరెడ్డి కూడా వేసేశారు

27 Mar 2016ఏపి సిఎం చంద్రబాబు ఫకీర్ వేషాలు మానుకోవాలంటూ ఉన్నట్లుండి ఏపిసిసి డిప్యూటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఫైరయ్యాడు. ఈయన మామూలుగా టిడిపిలోకి జంప్ కొట్టాలని భావించినా, ఎందుకో చివరి నిమిషంలో ఆగిపోయారని అంటారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నేతల్లో కాస్త హడావుడి బిగినైంది, వాళ్లలో రఘవీరారెడ్డి, చిరంజీవి, శైలజానాధ్ ఉండగా. ఇప్పుడు తులసిరెడ్డి కూడా జాయినైయ్యారని అర్ధం చేసుకోవాలి. తులసి రెడ్డి కామెంట్ల ప్రకారం చూసినా వైఎస్సార్సీపీ విమర్శలు చూసినా ఒకటి మాత్రం స్పష్టమవుతోంది. రాజధాని నిర్మాణం మాస్టర్ ప్లాన్ ఇలా ప్రతిదాంట్లో చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్, జపాన్ కంపెనీలకు డబ్బులిచ్చే ప్లాన్లు తయారు చేయించుకున్నారనేది క్లియర్ బైటికి ఉచితం అని చెప్తున్నా, ఎవరికి ముట్టాల్సినవి వారికి ముట్టాయ్. మాట మాట్లాడితే చంద్రబాబు "సింగపూర్ లో సింగపూర్ ప్రభుత్వం కూడా" అంటుంటారు. అక్కడికి ప్రపంచానికే సింగపూర్ రోల్ మోడల్ అయినట్లు ఐతే మాస్టర్ ప్లాన్ కి 15 కోట్లు, డిజైన్ల కోసం మకీ కంపెనీకి దాదాపు కోటిరూపాయలు చెల్లించారట. 

అలానే నిధుల సేకరణకు 112కోట్లు చెల్లించబోతున్నారన్నది ఆయన ఆరోపణ ఇది నిజమైతే అంతకన్నా అజ్ఞానం మరోటి ఉండదు. ఐతే ఈ  అంశంలో మరో వార్త మాత్రం టిడిపికి ప్రభుత్వానికి కాస్త పాజిటివ్ గా కన్పిస్తోంది. ప్రపంచ బ్యాంక్ కేపిటల్ సిటీ నిర్మాణానికి 6800 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సముఖత చూపుతోందట. ఇదే వాస్తవరూపం దాల్చితే కష్టాల్లో ఉన్న టిడిపి ప్రభుత్వం మరి కొన్నాళ్లు ఊపిరి పీల్చుకోవచ్చు. ఐతే మధ్యలో విపక్షాల ఆరోపణలకు జవాబివ్వాల్సి ఉండగా  ఎదురుదాడి చేయడంపైనే విమర్శలు వస్తున్నాయ్.
APCC President Tulasi Reddy fired on Chandrababu Naidu. He comment about AP capital master plan and about to AP Capital.