రేపు తీర్పు

17 Mar 2016


                    చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత రోజా సస్పెన్షన్ అంశంపై రేపో మాపో తీర్పు వచ్చే అవకాశం కన్పిస్తోంది. సుప్రీంకోర్టుకి వెళ్తే కానీ స్పందించని హైకోర్టు తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, పరిధి మీరి మరీ స్పీకర్ తనను సంవత్సరం సస్పెండ్ చేశారని రోజా పిటీషన్ దాఖలు చేయారు. అంతకుముందు ఇదే అంశంపై రోజా ఎన్నిసార్లు వాదించినా పట్టించుకోకుండా అంతా మాకు ముందే తెలుసన్నట్లుగా బిహేవ్ చేసిన టిడిపి నేతలు ఈ డెవలప్ మెంట్ తో షాక్ తిన్నారు. తీర్పు స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తే, పరువు పోతుందనే ఆందోళనతో ఉన్నారు. 

                            సెక్షన్ 340 (2) కింద కేవలం ఒక సెషన్‌ వరకు మాత్రమే సభ్యులను సస్పెండ్ చేసే అధికారం ఉందని రోజా తరఫు లాయర్ కోర్టులో వాదించారు. శాసనవ్యవస్థలో ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగినప్పుడు విచారించే ఆధికారం కోర్టుకు ఉఁదంటూ వాదన సాగింది. దీంతో కోర్టు ఏకీభవిస్తే తీర్పు రోజాకి అనుకూలంగా వచ్చే అవకాశమే కన్పిస్తుంది. ఐతే తీర్పు వచ్చేవరకూ ఎదురు చూడాలి.
Judgement to case against YSRCP MLA Roja suspension is today. In high court Roja filed a case against speaker on her suspension.