కాజల్ కే సాధ్ ఆత్మవిస్వాస్..

17 Mar 2016


                             తెలుగులో ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలు చేయని టాప్ హీరోయిన్ అంటే ఒకళ్లు అనుష్క, రెండోది కాజల్. బట్ వీళ్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఇప్పుడు రీ ఎంట్రీ లా కాజల్ అగర్వాల్ మళ్లీ జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుతో నటిస్తోంది. అంతేకాకుండా ఫస్ట్ టైమ్ పవన్ కల్యాణ్ తో కూడా హీరోయిన్ గా చేస్తోంది. అబ్బాయ్ రామ్ చరణ్ తో మగధీర చేసే టైమ్ కి అప్పుడప్పుడే కాజల్ ఎదుగుతుండగా. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్ గా అటు తమిళ్, ఇటు తెలుగులో టాప్ హీరోయిన్ కనీసం కోటి రూపాయలు సినిమాకు తీసుకునే రేంజ్ కి ఎదిగింది కాజల్ అగర్వాల్. ఈ రేంజ్ తో ఇప్పుడు కాజల్ బాబాయ్ కల్యాణ్ తో చేస్తుండటం విశేషం. 

                  ఈ మధ్య కాలంలో అటు బాబాయ్ అబ్బాయ్ లతో కలిసి నటించిన హీరోయిన్ లేదనే చెప్పాలి. పర్టిక్యులర్ గా మెగా కాంపౌండ్ లో ఈ ఏప్రిల్ లోనే రిలీజ్ కి సిధ్దమవుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ లో కాజల్ అగర్వాల్ అప్పటి మగధీరలోలానే రాజకుమారి గా కన్పిస్తుందట. అందుకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు ట్విట్టర్లో పోస్ట్ చేసింది కాజల్. అది చూస్తుంటే గ్లామర్ పెరుగుతుందే కానీ. తగ్గదు కాబోలు హీరోయిన్లకు అన్పించకమానదు మరి అన్నట్లు ఈ సినిమా ఆడియో నాలుగు రోజుల్లోనే రిలీజ్ కాబోతోందట.
Recently Kajal Agarwal and Anushka are not doing movies in Tollywood. But still they are top most heroins. Now Kajal Agarwal doing in Sardhar, and she taking one crore remuneration.