నిజంగా అప్సరలే

17 Mar 2016


                      తెలుగు హీరోయిన్లు సారీ, తెలుగులో నటించే హీరోయిన్లు అందంలో ఎవరికీ తీసిపోరు. నిజంగా అద్భుతమైన అందానికి, సొగసుగత్తెలకు పెట్టింది పేరు టాలీవుడ్ ఇండస్ట్రీ. అది మరోసారి జీ అప్సర అవార్డుల ఫంక్షన్ మరోసారి ప్రూవ్ చేసింది. నిండుగా డ్రస్సుంటేనే మెరిసి పోయే ఈ తారలు ఈవెంట్ కి షార్ట్ క్యాస్ట్యూమ్స్ లో రావడంతో ఫ్యాన్స్ కి కిర్రాక్ పుట్టించారనే చెప్పాలి.

                      విమెన్ అంట్రప్రెన్యూరింగ్ ప్రత్యేకించి ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ లో రాణిస్తున్న మహిళలకు జీ అప్సర అవార్డులు ప్రదానోత్సవం జరగగా వాటికి క్యాస్టూమ్ డిజైనర్లనుంచి హీరోయిన్లు, ఆర్టిస్టులు, మోడళ్లు తళుక్కుమని మెరిసారు. విజయనిర్మల, కృష్ణ కుమారి, జమున, జయప్రద  ఓ తరం వారైతే, ఇప్పటి  అందాల భామలు కాజల్ అగర్వాల్, లావణ్య త్రిపాఠి, నందితారాజ్, హెబ్బాపటేల్, రెజీనా కాసండ్ర, రాశీఖన్నా, ఛార్మీకౌర్  తమ సొగసు పరువాల సంపదలను నీట్ గా ప్యాక్ చేసుకొచ్చారా అన్నట్లుగా ఎంట్రీ ఇవ్వడంతో జనం మతులు పోగొట్టుకున్నారు.
Tollywood is famous for beauty. Recently in Z Apsara awards total Tollwood heroins and models are gave surprise to fans in short dress.