డిఫరెంట్లీ డెఫినెట్ బ్యూటీ

7 Mar 2016                  మాటలు రాకపోయినా, విన్పించకపోయినా అభినయ పేరుకు తగ్గట్లు నటనతోనే తన ప్రతిభ నిరూపించుకుంది. ఇప్పుడామె హాలీవుడ్ కి కూడా వెళ్తుందని టాక్ విన్పిస్తోంది నానోడిగల్ మూవీతో తమిళంలో తెరంగ్రేటం చేసిన అభినయ ఆనంద్ ది కొంతమంది రాజమండ్రిఅని, కర్నాటక అనీ అంటారు. ఐతే విషయానికి వస్తే ఆమె ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో నటించబోతోందని విన్పిస్తోంది. సినిమాలకే పరిమితమైన లిప్ రీడింగ్ ద్వారానే తన కెరీర్ ను టాప్ రేంజ్ కు చేర్చుకున్న అభినయ అంటే అందరికీ ఓ సాఫ్ట్ కార్నర్ ఉంది. 2009లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అభినయ తన నటన, బిహేవియర్ తోనే ఈ రేంజ్ కు చేరిందని అర్ధం చేసుకోవాలి. అందుకే ఏడేళ్లలోనే 19సినిమాలు చేయగలిగిందామె. ఐతే ఎంత టాలెంట్ ఉన్నా రాణించాలంటే అందుకు అందం కూడా ముఖ్యం, సక్సెస్ అంతకంటే ప్రధానం, చక్కని చీరకట్టుతోనే కాకుండా మోడ్రన్ డ్రస్సులతో సెక్సప్పీల్ కూడా పుష్కలంగా ఉన్న అభినయని చూస్తే అంగాంగ ప్రదర్శన చేయించాలని ఎవరూ ఇంతవరకు అనుకోలేదు.                 వన్ లిటిల్ ఫింగర్ అనే ఇంగ్లీష్ మూవీలో అభినయ బుక్కైందట, ఇది డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ సమస్యల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. స్వయంగా తానే బాధితురాలు కావడంతో ఇందులో అభినయ అయితే ఖచ్చితంగా సరిపోతుందని నిర్మాతలు భావించినట్లు సమాచారం.
Tollywood character artiest Abhinaya is deaf and dump, but only with lip reading she doing acting and she did 19 movies in Tollywood and Kollywood. Now she is entering in to Hollywood.