దేవాలయం మాన్యాలూ భూంఫట్

3 Mar 2016                              ఇప్పటిదాకా సాక్షి కథనాలు కొన్ని వాస్తవాలనే బైటపెట్టింది. అసలు దందా ఇంకోటుంది, అది ఆంధ్రాపల్స్ కే ఎక్స్ క్లూజివ్. ఐతే మాకున్న పరిమితులతో భూమాయను పూర్తి ఆధారాలు బైటపెట్టలేకపోతున్నాం కేపిటల్ రీజియన్ లో టిడిపి పెద్దల దందా ఎలా నడుస్తుందో ఈ స్టోరీ చూస్తే మీకే అర్ధమైపోతోంది అమరావతి కేపిటల్ సిటీ పేరే కాదు, ఓ ఆధ్యాత్మిక పట్టణం కూడా కృష్ణానది తీరాన వెలసిన భౌద్దానికి వాసిరెడ్డి రాజుల గొప్పదనానికి సాక్ష్యం. ధరణికోటని రాజధానిగా చేసుకుని పాలించిన శాతవాహనుల నాటి చరిత్ర ఇప్పుడు పూర్తిగా నాశనం కాబోతోంది. ఇప్పటికే అయింది కూడా దీన్ని అడ్డుకోవాలంటే నెటిజన్లు మద్దతు కోరుతోంది ఆంధ్రాపల్స్. కృష్ణానది తీరంలో వెలసిన అమరలింగేశ్వరుని దేవాలయానికి వందలాది ఎకరాల భూమి ఉంది. ఇది సాగులో ఉండొచ్చు, లేకపోవచ్చు చాలావరకూ సాగుబడిలోనే ఉఁదనుకోవాలి. ఐతే వీటిలో వంశపారంపర్యంగా వచ్చే పౌరహిత్యం సాగడానికి అప్పటి రాజులు కొంతమందికి ఈ భూముల్లో కొంతభాగం సంక్రమింపజేశారు.


 
                             అలాంటి సారవంతమైన భూములపై ఇప్పుడు రియల్ దందా నడుస్తోంది, దేవాలయమాన్యం భూముల కొనుగోళ్లు, విక్రయాలు చెల్లవు. ఐతే తమకి ఉన్న రాజకీయపలుకుబడి ఉపయోగించి వీటి రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. నాలుగు ఎకరాలకు కోటిరూపాయల చొప్పున ధర పలికించి, ఆ తదుపరి తాము వాటిని పదిరెట్లుకు పెంచుకునే ప్లాన్ లో ఉన్నారు. అమ్మకపోతే బెదిరించైనా ఇలా భూములు లాక్కుంటున్నారని తెలుస్తోంది. దీంతో ఎకరాకు ఎప్పుడూ ఆదాయం 50వేలకు మించని భూములకు ఒక్కసారే కోటిరూపాయలు ఇస్తామంటే ఆశపడని వారెవరుంటారు. అలా అమాయక రైతులు, యజమానులు వాటిని అమ్ముకుంటున్నారు. ఇక్కడ మరచిపోని పోకూడని అంశం ఏంటంటే ఆ భూములు చారిత్రక ప్రాధాన్యం ఉన్నవి. అక్కడి నేలలో బౌద్దం అంతర్భాగం పురావస్తు శాఖ కూడా దీన్ని పట్టించుకోవాలి. ఇవాళ డబ్బులొస్తాయని వాటిని అమ్మేస్తే వాటి స్థానంలో కాంక్రీట్ కట్టడాలు వెలసిన తర్వాత ఇక ఆ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఎంత మొత్తుకున్నా తిరిగిరాదు ధరణికోటకి  ఆవల ఇవతల ఈ రియల్ దందా యధేచ్చగా సాగిపోతోంది. కావాలంటే అక్కడి స్థానికులను అడిగిచూడండి అందుకే సేవ్ ది ఆంధ్రా హిస్టరీ, అమరావతి చరిత్రను కాపాడండి.
Amaravathi is not only our capital name, it is one of historical place. And it is the famous for temples also. But in Amaravathi temple land are missed because of TDP leaders.