వినేవాడు వెర్రిపప్ప అయితే..!

9 Mar 2016


                           ఆంధ్రాపల్స్ చెప్పినట్లే జరుగుతోంది వాడెవడో దారిన పోయే లేడీ చేయి పట్టుకుని లాగబోతే, దానికీ వైఎస్ జగన్ కి అంటగడతారని, అలానే ఖచ్చితంగా అంతే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఎవరూ ఎవరినీ వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. మోయాల్సిన  అవసరం అంతకంటే లేదు. కానీ ఓ మినిస్టర్ కొడుకు దారినపోయే దానమ్మ(దానయ్యకి స్త్రీలింగం)ని పట్టుకుని లాగబోతే ఎవరూరుకుంటారు, చెప్పుతో కొడతారు. లేదంటే ఆ దారిన పోకుండా పారిపోతారు మొదటిది జరిగింది అది నిజం అందుకే మనోడు తర్వాత మందీ మార్బలం వేసుకుని మళ్లీ అదే ప్లేస్ కి మార్చి 3న పోయాడట, ఇది  ఎంక్వైరీలో తేలింది. అంటే మళ్లీ మనోడు తన పెతాపం బస్తీ జనంపై చూపిద్దామనే కదా కానీ టైమ్ రివర్సై బొక్కలో పడాల్సి వచ్చింది.

                               ఇప్పుడు సదరు పుత్రరత్నం ముందు మావోడు లేడన్నాడు, తర్వాత హే అసలు మావాడ్ని కొట్టారు మేమే కేసు పెట్టాలని డిసైడ్ అయ్యాం అన్నాడు. తర్వాత చంచల్ గూడకి పోయేసరికి ఇది కుట్ర, విదేశీ కుట్ర, రాజకీయకుట్ర అంటూ అచ్చం పాతరోజులను గుర్తుకుతెచ్చాడు( అప్పట్లో ఎన్టీఆర్ ఏది అడిగినా విదేశీకుట్ర ఉందనో ..ఇందిరాగాంధీ హస్తం ఉందనో  అనేవాడట) ప్రతిపక్షనేతకు దమ్ము లేక తప్పుడు కేసులు పెట్టించాడట. లేకపోతే పొలిటికల్ గా ఈయనేదో తెగ పొడిచేసినవాడిలా రెచ్చిపోయాడు. డైరక్ట్ గా ఆయన్ని ఎదుర్కోవాలట ఓ ఎస్సీ స్టూడెంట్ లైఫ్ తో ఆడుకోవద్దంటూ బీరాలు పోయాడు. అంటే ఆ వర్గాన్ని కూడా అడ్డుపెట్టుకుని బైటపడాలనుకున్నాడన్నమాట. ఐనా అవతలి వర్గం ఇంకా స్ట్రాంగ్ ముసుగు పనులు  పెట్టుకుంటే ఏమవుద్దో ఇప్పటికి తెలిసి వచ్చింది. ఇకనైనా మారండ్రా బాబూ ఏదడిగినా ఎదుటివాడిమీద నోరేసుకుని పడిపోవడం కాదు జనం ఏమనుకుంటున్నారో కాస్త కళ్లు తెరవండి.
TDP leaders are taking without logic. What ever happen in Andhra Pradesh they are linking to YS Jagan.