దొరికారు లే

3 Mar 2016                              సాక్షి కథనంతో కానీ వాస్తవాలు కానీ కేపిటల్ సిటీలో అంతా స్వఛ్చందంగా భూసేకరణ జరిగిందనేది వాస్తవం కాదు. ఇది లోపాయికారీగా అందరూ  ఒప్పుకుంటున్నదే ఐతే ప్రభుత్వం మాత్రం ఇందులో ఎలాంటి అవకతవకలు లేవని చెప్తుంటుంది. ఇప్పుడూ అదే  మాట అంటోంది, నిజానికి భూములు కొనొద్దని ఎవరూ అనరు కొనుగోలు శక్తి  ఉన్నోళ్లు నాలుగు డబ్బులొస్తాయనుకున్న చోట ఎవరైనా కొంటారు. ఐతే ఎక్కడ డబ్బులొస్తాయనే సంగతి ముందుగా వాళ్లకే ఎలా తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ సంగతి పక్కనబెడితే, అసలు అంత డబ్బు వారికి ఎలా వచ్చింది, ఇదీ స్థూలంగా ఈ భూంఫట్ ఎపిసోడ్ లో ఆలోచించాల్సింది. అసలు జగన్ ఏమంటున్నాడు, రోజా ఏం అడిగింది పక్కనబెట్టండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఇంత పెద్ద  ఎత్తున స్థలాలు ఎలా కొనగలుగుతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
  
                       ఓవైపు పయ్యావుల కేశవ్ నాలుగెకరాలు తానే కొన్నానని పైగా మగాడ్ననీ డంబాలు పలుకుతున్నాడు. ఆ తొందర్లో తన తప్పును తానే ఒప్పుకున్నట్లు మర్చిపోయి శపధాలు చేస్తున్నాడు, ఎకరాలకు ఎకరాలు సీఆర్డీఏ పరిధిలో ఎలా కొనగలుగుతున్నారు. ఎందుకంటే రియల్ బూమ్ ముసుగులో జనం నాశనం కాకుండా ఉండటానికి రిజిస్ట్రేషన్లు ఆపేసినట్లు ఓ సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. మరి వీళ్లంతా ఎలా రిజిస్ట్రేషన్లు చేసుకోగలిగారు, సరే సడలించిన తర్వాత చేయించుకున్నారనుకుందాం. దీనిపై ఒక మంత్రి ఒకమాట, మరో ఎమ్మెల్యే మరో మాట ఎందుకు చెప్తున్నారు. సామాన్య జనానికి అందుబాటులో లేని ధరలు వాళ్లకెలా దొరుకుతున్నాయ్. అంటే ఇక్కడ ఖచ్చితంగా అధికారదర్పం వాడుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు దొంగలు దొరికారనే అంటున్నారు.
In Amaravathi TDP leaders land mafia is a big issue. They are buying lands form farmers for low price and selling for high cost.