అగ్రి మంటలు ఎవరివి?

28 Mar 2016


ఏ అంశమైనా చనిపోయిన రాజశేఖర్ రెడ్డికి, బతికి ఉన్న జగన్ కి  అంటగట్టడం టిడిపి ప్రభుత్వానికి ఫ్యాషనైపోయిందని ఏపీవాసులకు క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే అగ్రిగోల్డ్ మోసాలు వైఎస్ హయాంలోనే మొదలయ్యాయంటూ టిడిపి నేతలు, మంత్రులు తెగ మోసేస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఇఁకోటి ఉంటుందా? ఇది అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన. ఎందుకంటే రీసెంట్ గానే చంద్రబాబు అనవసరంగా కోర్టు పరిధిలోకి కేసు పోయింది లేకపోతే తమ దృష్టికి వస్తే ఎప్పుడో కేసు పరిష్కరించేవాళ్లమంటూ ప్రకటించారు. అప్పుడే ఈ బాధితుల సంఘం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము గత రెండేళ్లుగా అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే హైకోర్టులో కేసు పెట్టామని చెప్పారు వాళ్లు.

ఇది మర్చిపోయి అసెంబ్లీలో చర్చ సందర్భంగా అసలిందులో రాజకీయం లేదని అచ్చొన్నాయుడు తేల్చడం దారుణం. ఎందుకంటే అగ్రిగోల్డ్ సంస్థకే చెందిన హాయ్ లాండ్ లో మంత్రి పత్తిపాటి బంధువులు ఆస్తులు కొనుగోళ్లు చేశారని ఆరోపణలున్నాయ్, కాబట్టి ఇందులో ఖచ్చితంగా రాజకీయకోణం ఉంటుంది. అలానే అగ్రి గోల్డ్ కి అంబాసిడర్ గా వ్యవహరించిన సాయికుమార్ ని ఏపికి అంబాసిడర్ గా ఎలా పెడతారు. ఈ మోసాలకు సాయికి సంబంధం లేకపోవచ్చు కానీ రియల్ ఎస్టేట్ కేసులే కాదు, ఎందులో అయినా ప్రకటనల్లో నటించినవారిపైనా కేసులు పెట్టొచ్చని చట్టం చెప్తోంది. ఆస్తులు వేలం వేయాలి, యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని కోర్టు ఎంతగా మొట్టికాయలు వేసినా పట్టించుకోకుండా కావాల్సినంత జాప్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీలో చట్టం ప్రకారం చేస్తున్నామనడం హాస్యాస్పదం. అసలు వైఎస్ హయాంలో మోసాలు ప్రారంభమయ్యాయ్ అని చెప్పేబదులు ఇప్పుడు ప్రభుత్వం ఏమీ చేయలేదని డైరక్ట్ గా చెప్పొచ్చు కదా. ప్రతీదానికి వైఎస్ హయాం, వైఎస్ జమానా అంటూ ఆయన జపం చేసేబదులు చేవ ఉంటే బాధితులకు న్యాయం చేయొచ్చు కదా..! అది వదిలేసి కేసును రాజకీయం చేస్తున్నారంటూ అచ్చెనాయుడు కబుర్లు చెప్పడం అసమర్ధతను చాటుకోవడమే అవుతుంది..
Agrigold case created sensation India wide. Lacks of peoples were cheated by Agrigold. But TDP government is not responding, and giving wrong statements.