కుంటిసాకులు...నంగనాచి కబుర్లు

14 Mar 2016                        ఏపీ అసెంబ్లీలో అవిశ్వాసం సందర్భంగా టిడిపి వ్యవహరించిన తీరు చూస్తే, ఎవరికైనా వళ్లు మండకమానదు. అవిశ్వాసతీర్మానంపై వైఎస్ జగన్ సంతకం పెట్టలేదని ఒకరు, రూల్స్ తెలియవని ఒకరు తెగ జ్ఞానాన్ని పంచిపెట్టారు. దానికి సభలో వైఎస్ జగన్ డైరక్ట్ గానే నిబంధనలగురించి చెప్పారు. అవిశ్వాసతీర్మానం ఎవరైనా ఇవ్వొచ్చు దానికి ఫలానే వ్యక్తే సంతకం పెట్టాలని కానీ, మాట్లాడాలని కానీ లేదని చెప్తే అవతలి పక్షం అది వదిలేసి ఏదేదో మాట్లాడేశారు. తాడికొండకి చెందిన శాససనభ్యుడు ఒకరంటారు " శుభకార్యానికి పిలిస్తే రానని చెప్పడం సబబా" అని రాజధాని గురించి ఉద్దేశించి జగన్ పై ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ అప్పుడే తన అభిప్రాయం స్పష్టంగా చెప్పారు". రైతుల కన్నీటితో కట్టే రాజధాని నిర్మాణానికి నేను రాబోవడం లేదు'" 

                         అది నిజం కాకపోతే. పవన్ కల్యాణ్, ఏపిసిసి అధ్యక్షుడు రఘవీరారెడ్డి. సిపిఐ నారాయణ, సిపిఎం రాఘవులు, చిరంజీవి సహా చాలా మంది వెళ్లలేదు. అది వదిలేసి జగన్ రాలేదు, అని దొంగ ఏడ్పులు ఎందుకు? పైగా అసెంబ్లీలో నో కాన్ఫిడెన్స్ మోషనే కాదు, ఇంకే అంశమైనా తనకి మాత్రమే తెలుసన్నట్లుగా ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు బిహేవ్ చేసే పద్దతి సమర్ధనీయం కాదు. ఎందుకంటే గతంలో వైఎస్ హయాంలో కూడా ఇలానే రెచ్చిపోయి ఆ తర్వాత పదేళ్లు అధికారానికి దూరమైన ఘనత ఆయనది. ఒకవేళ రూల్స్  తెలియని వైఎస్ జగన్ ఆయన పార్టీ తప్పు చేస్తే మరి అన్నీ తెలిసిన టిడిపి ఏం చేసిందో కూడా చూడాల్సి ఉంటుందిగా, జంపైన ఎమ్మెల్యేలు ఎందుకు సభకి రాలేదు. అలానే విప్ జారీ చేసే సమయం కూడా ఇవ్వకుండా ఎందుకు చర్చకు పిలిచింది. అంటే ఇక్కడే తమ నక్కజిత్తులు ప్రదర్శించారని తేటతెల్లమైపోయింది కదా.
Today in AP assembly YSRCP introduced no confident motion. For that all TDP leaders including speaker, are not talking as foolish.