నరం లేని నాలుక

9 Mar 2016


                                గతంలో వైఎస్ నామస్మరణ కాంగ్రెస్ నేతలకంటే ఎక్కువ టిడిపివాళ్లే చేసేవాళ్లు, ఏరోజూ ఆయన పేరెత్తకుండా రోజు గడిచేది కాదు. ఇక్కడ టిఆర్ఎస్ నేతలకూ ఆయనే సబ్జెక్ట్ హెలికాప్టర్ లో నల్లకాలువపైగా వెళ్తూ చనిపోయిన వైఎస్ రెండు పార్టీలకు పునర్జన్మ ఇచ్చారనే చెప్పాలి. అప్పటిదాకా కలుగులో ఎలుకలా దాక్కున్న కేసీఆర్ బైటికి రావడం, పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేక చతికిలబడ్డ చంద్రబాబు లేచి నిలబడటం అందరికీ తెలిసిందే, ఇప్పుడదే దృశ్యాలు రిపీట్ అవుతున్నాయ్. రాజధాని భూరగడ వెనుక జగన్ హస్తం, రావెల కొడుకు కీచకపర్వం వెనుక జగన్ హ్యాండ్, ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడం వెనుక జగన్ హస్తం, కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ దీక్ష వెనుక వైఎస్ జగన్ హ్యాండ్, ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడమే. ఏదైనా విమర్శ చేస్తే సహేతుకంగా ఉండాలి. కానీ టిడిపి నేతలు మాత్రం అవన్నీ గాలికి వదిలేసి రాష్ట్రంలో ఏ సమస్య తలెత్తినా దాని వెనుక జగన్ ఉన్నాడంటూ రోజూ నామస్మరణలో తపిస్తున్నారు. 

                         పైగా జగన్మోహన్ రెడ్డికి కోర్టు విచారణ, జైళ్లు అలవాటైపోయాయంటూ ఓ సత్రకాయ్ ప్రేలాపన ప్రారంభించాడు. ఇప్పుడతగాడి సహచరుడి పుత్రరత్నం చంచల్ గూడలో రెస్ట్ తీస్కుంటున్నాడు. రేపో మాపో ఓ కేంద్రమంత్రి కూడా ఇదే రకంగా జైలుకి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఏపీ రాజధాని పరిసర జిల్లా గుంటూరులో ఓ ఎమ్మెల్యే మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయి, మరో ఎమ్మెల్యే డైరక్ట్ గా కోర్టే శిక్ష వేసినా పై కోర్టు తీర్పుతో బయటపడ్డాడు. మరో ఎమ్మెల్యే భూదందాలపై కేసులు నమోదవుతున్నాయ్ వీటన్నింటిని మర్చిపోయి, ఎదుటివారిపై కామెంట్లు చేసుకుంటూ పోతే తమ భాగోతాలు బైటపడవనేవి అతగాడి ఉద్దేశం ఏమో మరి బొండా ఉమ కొడుకు యాక్సిడెంట్ కేసులో ఎలా తప్పించుకున్నారో అందరూ చూసారు. పైగా వీళ్లంతా మహిళాదినోత్సవ సంబరాలు చేసుకుంటారట, ఓ ఎమ్మార్వోని కొట్టిన ఎమ్మెల్యేకి శిక్ష లేదు, తమ మంత్రి వర్గ సహచరుని కళాశాలల్లో ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా దిక్కులేదు. పైగా నిండు సభలో తామేదో గొప్ప పని చేసినట్లు స్వయంగా మేమే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాం అని చెప్తుంటే వినేవాడు వెర్రిపప్ప అయితే అనే సామెత గుర్తుకు రాకమానదు.
In Andhra Pradesh and Telangana all TDP and TRS leaders are telling YSR name. One of the minister son is going to jail, and one of the TDP central minister is ready to jail.