24 ట్రైలర్ అదుర్స్...

7 Mar 2016                   ఎక్స్ పెరిమెంట్ మూవీలు చేయడమంటే మొదట్నుంచీ ముందుండే హీరోల్లో సూర్య ఒకరు. ఇప్పుడు తాజాగా సైన్స్ ఫిక్షన్ మూవీ 24 చేస్తున్నాడు, సూర్య అందులో త్రిబుల్ రోల్ చేస్తున్నాడని ట్రైలర్ రిలీజ్ తో తెలిసిపోయింది. విక్రమ్ కుమార్ డైరక్షన్లో వస్తున్న 24 కథ అంతకుముందు ప్రిన్స్ మహేష్ కి విన్పిస్తే రిజెక్ట్ చేసాడని టాక్, మొత్తం 5 వేరియేషన్లలో కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

                     క్రేజీ ప్రాజెక్ట్ గా చెప్తున్న ఈ సినిమాకు మనం సినిమా తీసిన విక్రం కుమార్ డైరక్టర్. వరల్డ్ క్లాస్ విజువల్స్‌తో అదరహో అనేలా ఉందీ టీజర్. మూడు విభిన్న పాత్రల్లో త్రిబుల్ బ్రదర్స్ గా సూర్యకన్పిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని పోస్టర్‌లు విడుదల చేసిన సినిమా యూనిట్. ఈ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచారు. సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ మరియు గ్లోబల్ సినిమాస్ ఈ చిత్రాన్ని జాయింట్ గా నిర్మిస్తోంది, ఎఆర్ రెహ్మాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా చెప్పాలి.
Kollywood hero Surya is popular for experimental movies. His latest movie 24 trailer is released recently. It got more hits.