బాలయ్యకు సుమన్ గేలం

10 Mar 2016


                                 బాలయ్య చాలా మంచోడు, లేడీస్ అంటే ఆయనకి చాలా గౌరవం అంటూ ఒకప్పటి హీరో ఇప్పటి నటుడు సుమన్ వెనకేసుకువచ్చాడు. ఓ ఆడియో ఫంక్షన్‌లో బాలకృష్ణ చేసిన కామెంట్లపై సారీ చెప్పారని ఇక ఆ విషయం వదిలేయాని సుమన్ విశాఖపట్నంలో అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే బాలకృష్ణకి ఇండస్ట్రీలో ఎవరూ ఈ విషయంలో మద్దతు కాని, వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదు ఐతే సుమన్ ఒక్కడే ఇలా సపోర్టివ్వడం వెనుక పెద్ద ప్లానే ఉంటుందంటున్నారు. అందులో ఒకటి బహుశా మనోడు మళ్లీ టిడిపిలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడేమో అని గుసగుసలు బయలుదేరాయ్. ఒకప్పుడు సుమన్ ఎన్టీఆర్ హయాంలో టిడిపిలో ఎంట్రీ ఇచ్చాడు, కొన్నాళ్లు బాగానే తిరిగాడు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పార్టీ సభలకు సమావేశాలకు హాజరయ్యేవాడు, ఐతే ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయి పక్కనుండిపోయాడు. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ట్రై చేస్తుండొచ్చు.

                             ఇక రెండో రీజన్ గతంలో జగదేకవీరుడు అని సూపర్ స్టార్ సినిమా ఒకటి వచ్చింది. అది ఫాంటసీ సినిమాలా తీశారు. అందులో కృష్ణ క్యారెక్టర్ ఇంద్రలోకం వెళ్తుంది. అలాంటి క్యారెక్టర్ లభించడం కృష్ణగారిఅదృష్టమంటూ సుమన్ పొగిడేశాడు. ఆ తర్వాత కృష్ణ నటించిన సినిమాల్లో మనోడికి క్యారెక్టర్లు పడ్డాయ్. ఎగ్జాక్ట్ గా ఇప్పుడదే జరిగిందని చెప్పలేం కానీ. సుమన్ కి కూడా ఇప్పుడు వేషాలు తక్కువయ్యాయ్. అందుకే ఇలా బాకా ఊదుతున్నాడంటారు. ఐతే సుమన్ ఇమేజ్ ను తక్కువ చేయడం కాదు కానీ..సీన్ చూస్తే ఇలా  అనుకోకతప్పడం లేదు మరి.
Present Balakrishna is the hot topic in Media. His comment on ladies created sensation. For Balakrishna say sorry,  but no one respond on this. Hero Suman support Balakrishna.