సెకన్ 8 పై భయం ఎందుకు ?

17 Mar 2016


                 హైదరాబాద్ లో ఉమ్మడి గవర్నర్ ఉన్నారు, ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇదిలా పదేళ్లు కొనసాగుతుంది, ఇది చట్టం దీన్ని ఎవరూ తప్పుబట్టడానికి కానీ, వ్యతిరేకించడానికి కానీ లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం సెకన్ 8 ని తాము ఒప్పుకోం అంటున్నారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం ఖండిస్తున్నామంటూ ఓ ప్రకటన చేశారు
అసలు టిఆర్ఎస్ కి అంత ఉలుకు ఎందుకో ఎప్పుడూ చెప్పదు. అంత ఖచ్చితంగా వ్యతిరేకించేవాళ్లైతే, తెలంగాణ విభజన బిల్లునే వ్యతిరేకిస్తే ఈ సిచ్యుయేషన్ ఉండేది కాదు కదా. 

           కానీ వాళ్లకి పదిజిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని అంటూ 1956 కి ముందున్న తెలంగాణ కావాలన్నారు. కానీ టెక్నికల్ గా అనడమే కానీ నిజంగా అదే జరిగితే భద్రాచలం అంతకుముందు ఏపీలోనే ఉంది. మరి దానికి కేటీఆర్ నీళ్లు నమిలాడప్పట్లో అది వదిలేస్తే తెలంగాణ సాధనే ద్యేయం అన్నప్పుడు ఆ బిల్ లో ఉన్న ఉమ్మడి హైకోర్టు, ఉమ్మడి రాజధానిని పక్కనబెట్టి, కన్వీనెంట్ గా హైదరాబాద్ ఏదో వాళ్లబ్బ సొత్తులా మాట్లాడుతున్నారిప్పుడు. ఏపీ లో పార్టీలు వేరైనా ఈ అంశంలో ఒకటిగానే వ్యవహరిస్తున్నాయ్. ఓటుకు నోటు కేసు సందర్భంగా చంద్రబాబు అండ్ కో ఈ అంశాన్నిీ ఎత్తి చూపారు కానీ, అంత మాత్రాన మిగిలిన పార్టీలు వ్యతిరేకించలేదు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని, తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటే  ఐపోదు. నిజంగా ఈ అంశంపై కోర్టుకు వెళ్తే వాళ్లకే మొట్టి కాయలు పడకతప్పదు.
Its two years passed away telangana state divide. But still fight between both state about section 8. KTR saying we want complete Telangana as 1956. But in 1956 Bhadrachalam is in Andhra Pradesh.