ఆధార్ ఉత్తుత్తి చట్టం కాదు

12 Mar 2016


                           ఆధార్ దేనికీ ఆధారం కాదు, దాన్ని పట్టించుకోవద్దు అది జస్ట్ ఐడెంటిటీ కార్డే అని గత మంత్రి ఓపెన్ గా  చించేశారు. ఐనా ఎవరూ పట్టించుకోలేదు ఎవరి మానాన వారు ప్రతీ పథకానికీ దానికీ లింకెట్టి జనం ప్రాణాలు తోడేశారు. తర్వాత విషయం సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ప్రయోజనం లేదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టే, ఆధార్ కార్డ్ దేనికి కంపల్సరీ చేయొద్దన్నది. కేంద్రం కూడా రాష్ట్రాలకు అదే సంగతిని లేఖ రూపంలో చెప్పింది. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆధార్ కార్డే అన్నింటికీ ఆధారం కాబోతోంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇప్పుడు వీళ్లకీ పాకింది. ఇక జనం ప్రాణాలు తోడేస్తారు ప్రతి ప్రభుత్వ సంక్షేమపథకానికి ఆధార్ కార్డ్ కి లింకెట్టడంతో ప్రతి ఏటా 15 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అరుణ్ జైట్లీ చెప్పారు. నాలుగు రాష్ట్రాలకు 2500 కోట్లు కలిసి వస్తాయంటున్నారు. 

                     మరింత లాభం వస్తుంటే ఏ రాష్ట్రమైనా ఎందుకు వద్దంటుంది. కాకపోతే ఇక జనానికే చుక్కలు కన్పిస్తాయ్. అర్ధం పర్ధం లేని నిబంధనలను అమలు చేయడంలో ఉన్న అత్యుత్సాహం ఆధార్ లో మాత్రం ఎందుకు చూపరు. మనిషి బ్రతికి ఉన్నా ఆధార్ కార్డ్ తీసుకురమ్మనే రోజులు వస్తాయోమో మరి. ఇలా ఆధార్ కార్డ్ చట్టాన్ని తీసుకురావడం వెనుక పెద్ద కుట్రే ఉందంటున్నాయ్ విపక్షాలు.
Recently Supreme court declared that Aadhar card is not mandatory for all government subsidy. But all state governments are linking Aadhar Card all government benefits to save money.