మిస్సయ్యారు..వగచుచున్నారు

28 Mar 2016


కొన్ని కొన్ని కాంబినేషన్లు భలేగా కలుస్తాయ్, కొన్ని కలిసినట్లే కలిసి మిస్సవుతుంటాయ్. ఇప్పుడు ఊపిరి సినిమాకు రెండోదే జరిగింది, మొదట ఈ  సినిమాలో హీరోయిన్ శృతిహాసన్  అనుకోగా తర్వాత ఆమె మనసు మార్చుకుంది. ఈ ఇష్యూలో పివిపి వెంచర్స్ నాంపల్లి కోర్టులో శృతిపై కేసు కూడా పెట్టారు. అలానే అంతకు ముందు కార్తి ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉండగా, చివర్లో ఈ కాంబినేషన్ వర్కౌట్ అవలేదు. ఇప్పుడు ఈ ఇద్దరూ తీరిగ్గా విలపిస్తున్నారట, ఎందుకంటే ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ మరే సినిమాకు ఈ మధ్య కాలంలో రాలేదు. అసలు కార్తి క్యారెక్టర్ ఖచ్చితంగా టైలర్ మేడ్ లా ఎన్టీఆర్ కి ఓ ఢిఫరెంట్ ఇమేజ్ వచ్చేది. ఐతే కార్తి రాకతో సినిమా తమిళ్ లో కూడా బాగా రన్నయ్యే అవకాశాలే కన్పిస్తున్నాయ్.

ఇక హీరోయిన్ శృతిహాసన్ పరిస్థితి కూడా అంతే, ఇక్కడ ఆమెకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ముందు సినిమాలో నటించాల్సి ఉన్నా చివరి నిమిషంలో డ్రాప్ అయింది. ఐతే ఇది తమన్నాభాటియాకి ప్లస్సైంది, తెలుగులో హిట్లు కరవై బాహుబలి సినిమాలో అరకొర క్రేజ్ ఏర్పడింది. అలాంటి టైమ్ లో వచ్చిన ఈ సక్సెస్ రెండు భాషల్లోనూ తమన్నాకి మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టినట్లే భావిస్తున్నారు.
Nagarjuna, Kaareek and Tamanna movie Oopiri was released yesterday. It got positive talk, it is present record. Actually in the place of Thamanna Sruthi Hassan have to work, in the place of Kartheek NTR was fixed first.