సెక్సీ లుక్ వస్తుందా

3 Mar 2016                       థండర్ ధైస్ తో ఒకప్పుడు హిందీ ఫీల్డ్ ను దున్నేసిన శ్రీదేవి హవా బాగానే సాగింది. మాధురిదీక్షిత్ ఎంట్రీ ఇచ్చేదాకా హిందీలో ఆమే నంబర్ వన్. ఐతే కాలక్రమంలో వెనకబడిపోయి హౌజ్ వైఫ్ గానే టైమ్ పాస్ చేసింది. ఐతే ఇంగ్లీష్ వింగ్లీష్ తో బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తనలో సత్తా ఇంకా తగ్గలేదని రుజువు చేసుకుంది. తర్వాత పులి అనే తమిళ సినిమాలోనూ ఓ క్యారెక్టర్ చేసి సెక్సీ లుక్ అలానే ఉందనిపించింది. సినిమా ఫ్లాపవడం, నిర్మాతలు రెమ్యునరేషన్ ఎగ్గొట్టారని కంప్లైంట్ చేయడం తర్వాత సంగతి కానీ తనలోని సెక్స్ లుక్ ని జనానికి ఓ సారి చూపించడంతో పాటు పాత జ్ఞాపకాలను తట్టిలేపింది.


                   ఇప్పుడు అదే శ్రీదేవి మరో సినిమాతో తెరముందుకు వస్తోంది. ఈసారి తన మొగుడు బోనీ కపూర్ తీసే సొంత సినిమాలో హీరోయిన్ గా, కమల్ కూతురు అక్షరహసన్ కు సవతితల్లిగా నటిస్తోందిందులో, ఓ రకంగా ఇది ఆమె క్యారెక్టరే అని చెప్పాలి. పెళ్లై పిల్లలున్న బోనీకపూర్ ను మనువాడిన శ్రీదేవితో బోనీకపూర్ మొదటి భార్య పిల్లలు సన్నిహితంగా ఏం మెలగరు. అదేం వాళ్లు దాచుకోరు కూడా శ్రీదేవి అంటే గౌరవం ఉంది తప్ప, మా తల్లి స్థానంలో ఎప్పటికీ రాలేదంటూ అర్జున్ కపూర్ ఓపెన్ గానే చెప్తుంటాడు. అలాంటి మనస్తత్వం ఉన్న ఓ కూతురుతో ఎలా సన్నిహితం అవుతుందనే కథాంశంతోనే ఈ మామ్ సినిమా తయారవుతోందని టాక్. నడివయస్కుడైన హీరోని తన సెక్సీతనం అవసరం కోసం పెళ్లాడే రోల్ చేస్తున్న శ్రీదేవి కొన్ని సీన్స్ లో గతకాలంనాటి శ్రీదేవిలా కన్పిస్తుందని అంటున్నారు. నవాజుద్దీన్ సిద్ధికీ అనే అనామకనటుడు ఇందులో శ్రీదేవికి భర్తగా నటిస్తున్నాడట.
Bollywood heroin was re entered with English and vinglish. Later she did  a Tamil movie called Pulli. Now she doing a Bollywood,  her husband as producer.