శృతి చేసింది

7 Mar 2016


                      ఈరోజున తెలుగు తమిళ సినిమా ప్రియులకు శృతిహాసన్ ను పరిచయం చేయక్కర్లేదు, వరస హిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు మంచి సింగర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఐతే విమెన్స్ డే సందర్భంగా శృతి ఇప్పుడు ఓ సాంగ్ రిలీజ్ చేయబోతోంది. మహిళల గొప్పతనాన్ని ఇప్పటికే చాలామంది చాలారకాలుగా స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. వారి బాటలోనూ శృతి కూడా తన భావాలతో రూపొందించిన ఓ గీతాన్ని ఆలపించి మహిళలకు 
అంకితం ఇవ్వబోతోంది, ఈ పాట రాసింది కూడా శృతి హాసనేనట.


                          బాలీవుడ్ మ్యుజీషియన్ ఎహెసాన్ లాయ్‌ స్వరాలు కూర్చిన ఈ గేయం వనితల విజయాలను కష్టాలను టచ్ చేస్తూ, సాగుతుందట. చిన్నప్పట్నుంచీ మ్యూజిక్ ని హాబీగా చేసుకున్న శృతికి సందర్భానుసారం ఇలా పాటలు రాయడం పాడటం అంటే ఇష్టమట. అలా విమెన్స్ డే సెలబ్రేషన్స్ కు తన కాంట్రిబ్యూషన్ ని  ఇస్తానంటోంది శృతిహాసన్.
Heroin Shruthi Hassan is very known person to Kollywood people. And she is also a good singer. Now she released a album on women day celebrations.