ఇదేం తీరు

19 Mar 2016


                  ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు కొండాటకం, దొంగాట అన్నీ నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ వాపోతోంది. తమ ఎమ్మెల్యే రోజాని సంవత్సరం పాటు సస్పెండ్ చేయడమే కాకుండా, హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా అదే తీరు కంటిన్యూ చేయడం ఆ పార్టికి ఆగ్రహం కలిగిస్తోంది. ఇది న్యాయస్థానాలను అవమానపరచడమే అని వైసీపీ అధినేత సహా పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ఎపిసోడ్ ఇలా హైడ్రామాతో సాగుతుండగానే, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ అంటూ ఒకటి పెట్టి అందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జ్యోతుల నెహ్రూ, రోజా కి నోటీసులు ఇచ్చారు. సభలో దురుసుగా ప్రవర్తించారు దీనికి మీ సమాధానం ఏంటంటూ సమన్లు పంపారు. ఐతే ఇప్పటికే ఓ వైపు రగడ జరుగుతుంటే, ఇలా నోటీసులు ఇవ్వడం కేవలం కక్షసాధింపే అని కొన్ని వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

          కేవలం ప్రతిపక్షసభ్యును టార్గెట్ చేసేందుకే ఇలాంటి నోటిసులు ఇస్తున్నారని కమిటీ ఎదుట హాజరైన ఎమ్మెల్యేలు ప్రకటించారు. సభలో అధికారపక్షం నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా, ఒకవైపే ఇలాంటి సమన్లు పంపించడం, విచారణలు చేయడం కక్ష సాధింపే అని వారంతా అభిప్రాయం వెల్లడించారు. 
Saturday also YSRCP MLA Roja is not allowed into Assembly. This is showing how TDP government missusing their powers.