తిరిగి తిరిగి మళ్లీ అక్కడికే

17 Mar 2016


                         కథలు కొత్తగా పుట్టవు, ఉన్నవాటికే మెరుగులు దిద్దుకుని అటూ ఇటూ కాస్త మార్చి కొత్తగా వస్తుంటాయంటారు. ఇప్పుడు బాఘి అనే హిందీ సినిమా కథ కూడా అలాంటిదే. దీని గురించి తెలుగు ప్రేక్షకులు కన్సర్న్ ఏంటంటే, ఇందులో విలన్ గా సుధీర్ బాబు నటిస్తున్నాడు. ఐతే కథ విషయానికి వస్తే ఇది ప్రభాస్ చేసిన వర్షం రీమేక్. అసలు వర్షం సినిమానే, హిందీ తేజాబ్ కి ఫ్రీమేక్ లాంటి సినిమా. ఆ తేజాబ్ సినిమాని తెలుగులో టూటౌన్ రౌడీగా వెంకటేష్, రాధ, మోహన్ బాబు, కృష్ణంరాజు, నరేష్ లాంటి భారీ క్యాస్టూమింగ్ తో తీసారు. దర్శకుడు దాసరి నారాయణరావ్. ఐతే అది ఫట్టైంది దాదాపు పదేళ్ల తర్వాత వచ్చిన వర్షం హిట్టైంది. ఆ వర్షం సినిమానే మళ్లీ బాఘీ పేరుతో హిందిలో తీయడం మామూలు కామెడీ కాదు.

                          అందుకే సినిమా కథలు కొత్తగా పుట్టవంటారు. దానికి తోడు ఎంఎస్ రాజు అదే ఊపులో మరో హిట్ నిమా ఫ్రీమేక్ తీయడం అది కూడా హిందీకి వెళ్లడం చూస్తే సినిమాజనానికి జ్ఞాపకశక్తి తక్కువేమో అన్పించకమానదు. మైనే ప్యార్ కియాను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ తీసిన ఎంఎస్ రాజు ఆ తర్వాత అది హిందీలో రామయ్యా వస్తావయ్యా అంటూ రైట్స్ అమ్మేయడం మనోడి చాతుర్యానికి నిదర్శనం. ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు కోకొల్లలు. హిందీ హమ్ సినిమా నుంచి తమిళ భాషా అక్కడ్నుంచి సమరసింహారెడ్డి వస్తే, ఫ్లాష్ బ్యాక్ సిరీస్ ఎన్ని వచ్చి తెలుగు చిత్రాలను ముంచెత్తాయో లెక్కేలేదు.
Tollwood hero Sudheer Babu is doing in Bollywood movie called Baghi. In this movie he is doing as a villain. Here matter is it is the remake of Telugu movie Varsam.