రెజీనాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నమెగా మేనల్లుడు!

24 Mar 2016మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నారనే వార్తలు గత కొంతకాలంగా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రంలో కలిసి నటిస్తున్నప్పుడు ఇద్దరూ ప్రేమలో పడిపోయారని, రెండో సినిమా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' షూటింగ్ సమయంలో ఇద్దరూ బాగా దగ్గరయ్యారని, అమెరికాలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకరికొకరు తమ ప్రేమను తెలియబరచుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే మా ఇద్దరి మధ్య ఏమీ లేదని రెజీనా ఓ సందర్భంలో చెప్పింది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయి ధరం తేజ్ 'తిక్క' మూవీలో నటిస్తున్నాడు. ఇదికాకుండా దిల్ రాజు నిర్మాతగా మరో మూవీలో నటించడానికి ఒప్పుకున్నాడు. ఈ మూవీలో రెజీనాని హీరోయిన్‌గా తీసుకోవాలని సాయిధరమ్ తేజ్ డిమాండ్ చేశాడంట. రెజీనాకి ఏ మాత్రం మూవీల ఆఫర్స్ తగ్గినా, టైం దొరికినా... వెంటనే తన మూవీలో హీరోయిన్ గా తీసుకునేందుకు సాయిధరమ్ తేజ్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడట.

వీరిద్దరి వ్యవహారం చూస్తే... ఫిల్మ్ ఇండస్ట్రీలో రెజీనాని కోరకుంటున్న హీరోగా సాయిధరమ్ తేజ్ రేసులో ముందు వరుసలో ఉన్నాడని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ గ్లామర్‌తో ముందుకు దూసుకెళ్తున్న హీరోయిన్ రెజీనా. ఈ మధ్య కాలంలో అందాలని ఆరబోయడానికి ఏ మాత్రం తగ్గడం లేదు. తన అందాలని నిస్సంకోచంగా అందరి ముందు చూపిస్తుంది. సినిమాలలో పద్దతిగా ఉన్నప్పటికీ... బయటకు వచ్చినప్పుడు రెజీనా తన అందాలతో తెగ రెచ్చిపోతోందట.

ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యాడట. ఈ మధ్య తన అమ్మ దగ్గరికి రెజీనాని తీసుకెళ్లి పెళ్లి విషయం మాట్లాడాలనుకున్నాడట సాయిధరమ్. వచ్చే యేడాది పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యాడట. అయితే ఇందుకు రెజీనా ససేమిరా కుదరదని చెప్పిందట. మంచి కెరీర్ ఉన్న సమయంలో ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయని సన్నిహితులు అంటున్నారు. సాయిధరమ్ తేజ్‌తో పెళ్లికి రెజీనా అంగీకరిస్తుందో, లేక సాయిని దేవదాస్ చేస్తుందో వేచి చూడాల్సిందే.
Regina is the one of the most popular heroin in Tollywood. Now she very busy with continuous movies. Now she is also getting offers in Kollywood also. Talk in Tollywood is she is in love with Mega family hero Sai Dharam Tej.