హిస్టరీ రిపీట్స్

27 Mar 2016


చరిత్రచర్వణం.. కాలచక్రం తిరుగుతుంటుంది. ఇది ఇప్పుడు నటుడు రాజేంద్రప్రసాద్ విషయంలోనూ జరుగుతోందా? ఎందుకంటే దాదాపు రెండు వందల సినిమాల్లో హీరోగా నటించిన రాజేంద్రుడు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు, తొందర్లోనే  ఓ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ చేయబోతున్నాట్ట గతంలో కెరీర్ బిగినింగ్ లో రాజేంద్రప్రసాద్ ఎక్కువ నెగటివ్ క్యారెక్టర్లు చేసేవాళ్లు. హీరో కృష్ణ నటించిన సినిమాల్లోనే 14 విలన్ క్యారెక్టర్లు చేసాడు. ఇవన్నీ చివర్లో మంచిగా మారేవి లేదంటే చనిపోయేవి. 

ఐతే ఇప్పుడు మాత్రం దర్శకుడు కృష్ణవంశీ రాజేంద్రుడిని ఓ నెగటివ్ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయ్యాడట. దీనికి రాజేంద్రుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలుస్తోంది. అలా తిరిగి తిరిగి తన కెరీర్ మొదట్లో చేసినట్లు మళ్లీ విలన్ క్యారెక్టర్లు రాజేంద్రప్రసాద్ చేసే అవకాశం కన్పిస్తోంది.
Tollywood comedy hero Rajendra Prasad almost did more than two hundred movie. He started his carrier with negative roles. Again he is doing negative role in director Krishan Vamsi movie.