సౌండ్ లేదు

11 Mar 2016


                     పాపం రేవంత్ రెడ్డి చూస్తే జాలేస్తుంది ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో అన్పిస్తుంది. పార్టీ తరపున అంతా తానై నడిపిస్తాననుకుని అడ్డంగా దొరికిపోయాడు, నెలరోజులు జైల్లో గడిపాడు. ఎలాగైనా పాలిటిక్స్ లో హై రేంజ్ కి పోతాననుకున్నాడు. కానీ ఖచ్చితంగా ఆర్నెల్లు గడిచాయో లేదో, ఇప్పుడు పార్టీ పరిస్థితే చేలో పడ్డ గుడ్డెద్దులా తయారైంది. ఒక్కొక్కళ్లుగా  ఎమ్మెల్యేలంతా పార్టీ విడిచి టిఆర్ఎస్ లో జాయినవుతుంటే తానేమో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఇది ఆయనే చెప్పాడు వివేకానంద పార్టీ మారిన రోజు నిద్రపట్టలేదని ఇప్పుడు మాగంటి గోపీనాధ్, గాంధీ కూడా పార్టీ మారారు. అసలు గాంధీ పేరు పెట్టుకుని ఇలా అనైతికంగా వ్యవహరించడం ఆ ఎమ్మెల్యేకే తెలియాలి కానీ, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక్కడే అసెంబ్లీలో టిడిపి తరపున కూర్చోవాలి. అక్కడ అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఎలా ఎగతాళి చేసినా పడి ఉండాలి, టీజింగ్ ర్యాగింగ్ ఇలాంటివన్నీ సహించాలి. ఏది మాట్లాడబోయినా స్పీకర్ మైక్ ఇచ్చినా రన్నింగ్ కామెంట్రీ తప్పదు. 

                             మనోడికి ఉన్న ఆవేశానికి ఇక గొంతు చించుకుని తర్వాత ఏడుపు ఒక్కటే మిగిల్చుకోవాలి. కానీ అంతా బాగానే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేల జంపింగ్ వ్యవహారంలో ఏదైనా మాట్లాడాలంటే,  ఏపీ సిఎం చంద్రబాబు వైఖరే అడ్డుపడుతుంది. అక్కడ ఆయనలా చేర్చుకోవచ్చా అనే ప్రశ్న ఎదురువుతుంది. మరెలా అందుకే ఇప్పుడు ఖంగ్ మని మోగే రేవంత్ రెడ్డి డైలాగ్స్ లో సౌండ్ లేదు. ఏదో నామ్ కే వాస్తే గా  సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండగానే టీడీపీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని స్టాక్ డైలాగ్ వేసాడు. అనర్హత గురించి పట్టించుకోకుండా విలీనం చేయడం ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
In Telangana TDP Revanth Reddy is one and only person. And vote for note case is also now running. How pretty Revanth Reddy.