రోడ్లపై ఇక ప్రవేట్ బస్సులొస్తాయా..?

29 Feb 2016                             కేంద్రబడ్జెట్ లో ప్రధాన వాటా దక్కిన మరో రంగం రోడ్లు రవాణా సదుపాయాలు, దాదాపు ఇరవైలక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఈ రెండు రంగాలకు సుమారు రెండున్నరలక్షల కోట్లు కేటాయించారు. దీంతో రవాణారంగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు అన్పిస్తోంది. దాంతో పాటు ప్రవేట్ ట్రాన్స్ పోర్ట్ ఆపరేటర్లకు పాసింజర్ రవాణా వ్యవస్థలో చోటు కల్పిస్తామని చెప్పడం గమనార్హం.

                           కేంద్ర బడ్జెట్ లో అరుణ్ జైట్లీ రోడ్లు - రవాణా సదుపాయాలకు ముఖ్యమైన వాటా కేటాయించారు. మొత్తం 19.78 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన జైట్లీ ఇందులో ప్రణాళికా వ్యయం 5.5 లక్షల కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం 14.28లక్షల కోట్లుగా చెప్పారు. ఈ బడ్జెట్ రోడ్లు- రైలు- విమాన ప్రయాణాలకు ప్రాధాన్యం కల్పించినట్లు కేటాయింపులు చెప్తున్నాయ్. 
రోడ్లు - జాతీయ రహదారులు- రైల్వేలకు 2,21,246 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. దేశంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన జైట్లీ నేషనల్ హైవేల విస్తరణ. అభివృధ్దికి  97 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 27 వేల కోట్లతో 2.23 లక్షల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపడుతామన్నారు అరుణ్ జైట్లీ.  అలానే ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు 19 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. 

                                 ట్రాన్స్ పోర్ట్ రంగంలోని పర్మిట్ రాజ్ విధానం రద్దు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి. దీంతో పాసింజర్లు రవాణారంగంలో ప్రవేట్ కు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ప్యాసింజర్ బస్సుల నిర్వహణకు కొత్త ప్రయోగం చేపడుతామన్నారు. ఇలా ప్రవేట్ ఆపరేటర్లకు తలుపులు తెరవడంతో ఇక రాష్ట్రాల బస్ సర్వీసులకు మంగళం పలుకుతారేమో అని అనుమానాలు కలుగుతున్నాయ్. ఇక మిగిలి పోయిన అసంపూర్తిగా ఉన్న విమానాశ్రయాల నిర్మాణాలకు  150 కోట్లు కేటాయించామని  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఐతే ఈ కేటాయింపు ఆ రంగంలో అసంతృప్తి మిగిల్చిందనే అంటున్నారు.
In central budget 2016 preference is given to Road transport. Special offers is given to private travels to transport peoples.