అన్నదాతకు అండగానట

1 Mar 2016                             కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నదాతలకు అండగా నిలిచారు. రైతాంగం బావుంటుంటేనే ఆర్ధిక రంగం బావుంటుందని చెప్పిన మంత్రి సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యవసాయరంగానికి బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించారు, వచ్చే ఏడాదికి 9 సూత్రాల ఆధారంగా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్న అరుణ్ జైట్లీ . వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 35,985 కోట్లు కేటాయించారు. 2020 నాటికి వ్యవసాయ ఆధారిత ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమన్నారు. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకానికి గత ఏడాది కంటే దాదాపు 4 వేల కోట్లు అదనంగా  38500 కోట్లు కేటాయించినట్లు జైట్లీ వెల్లడించారు. భూగర్భ జలాల పెంపునకు రూ. 60 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 87765 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.

                                     రైతాంగానికి దన్నునిచ్చే పశుపోషణ కోసం 4 పథకాలు అమలుకు రూపకల్పన చేశ్తున్నట్లు అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రతీ పశువుకు  ఐడెంటిపికేషన్ సంఖ్యతో పాటు పశు వైద్య పరీక్షల కార్డులు, పాల సేకరణకు ప్రోత్సాహం ఈ-మార్కెటింగ్ సౌకర్యాలు అరుణ్ జైట్లీ బడ్జెట్ లో హైలెట్స్. అలానే గ్రామాల్లో  300 రూర్బన్ క్లస్టర్ల ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాని సించాయి యోజన ద్వారా అదనంగా 25 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని జైట్లీ అన్నారు. వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం  86500 కోట్లు వ్యయం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రైతుల కోసం ఏప్రిల్ 14 నుంచి ఈ- మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. రైతులు ప్రజలకు ఆహార భరోసా ఇచ్చేందుకు గాను పప్పు ధాన్యాల అభివృద్ధికి 500 కోట్లు ఖర్చు చేస్తామన్నారాయన.
In Union budget 2016 it is benefit to farmers. Preference is given to agriculture and horticulture. And special budget is released to milk and its products.