చంద్రబాబుపై పోచారం విసుర్లు

31 Mar 2016


జరిగిపోయిన కథలు చెప్పడం పొలిటీషియన్లకు వెన్నతో పెట్టిన విద్య, అందులోనూ వైఎస్ చనిపోయిన తర్వాత ప్రతీ ఒక్కళ్లూ తెలంగాణ కోసం తెగ పోరాడితే ఆయన బెదిరించినట్లూ, తాము మొక్కవోని ధైర్యంతో ఎదిరించినట్లూ తెగ బిల్డప్స్ ఇచ్చేవాళ్లు ఇప్పుడదంతా కాస్త స్లో అయింది. తాజాగా ఆ ట్రెండ్ లోకి చంద్రబాబును లాక్కొచ్చారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని ప్రవేటీకరణ జరిగింది బాబు హయాంలోనే, ఆప్పుడు గమ్మునున్న శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మాత్రం ఆ సంగతే మర్చిపోయినట్లు చంద్రబాబుతో పోరాడినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. 

అప్పటి చక్కెరశాఖామంత్రి ని తానేమో ప్రవేటీకరణ వద్దన్నట్లు చెప్తే, చంద్రబాబు గట్టిగా ఓ చరుపు చరిచారని, తన వళ్లు కూడా వాతలు తేలాయని చెప్పుకొచ్చారాయన. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరెందుకు మంత్రిపదవినే పట్టుకుని వేలాడారని, అడిగితే పోచారం సైడ్ నుంచి నో రెస్పాన్స్ మరి చంద్రబాబునాయుడు గారు దీనికి ఏం సమాధానం చెప్తారో మరి..!
It is common thing in Telugu states politics. Now TDP leaders are commenting on YSR. In the same way Telangana minister Pocharam Srinivas Reddy commented on Chandrababu Naidu.