అన్న పాటకి తమ్ముడి స్టెప్పులు

7 Mar 2016                      ఫ్యామిలీ హీరోలకు తమ తాత తండ్రుల పాటలు, డైలాగులు వాడుకోవడం మామూలే. పవన్ కల్యాణ్ కూడా అన్న చిరంజీవి హిట్ సాంగ్ ను రీమేక్ చేయబోతున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కొండవీటి రాజాలోని హిట్ సాంగ్ ను వాడుకుంటున్నాడట. నా కోక బాగుందా..నా రైక బాగుందా అంటూ సాగే ఆ పాటలో చిరంజీవి, విజయశాంతి, రాధ మాంచి హుషారైన స్టెప్పులేశారు. ఇప్పుడు పవన్ కూడా ఇద్దరో ముగ్గురో భామలతో ఈ పాటకు నృత్యం  చేస్తాడని అంటున్నారు. 

                    చిరంజీవి సినిమాల్లో పాటలను గతంలో ఎవరూ ముట్టుకోలేదు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ తెరకి ఎక్కిన తర్వాతే ఆయన పాటలను వాడుకోవాలనే ఆలోచన వచ్చింది అందరికీ. ఐతే తమ్ముడు పవన్ వేరే పాత పాటలను తెరకెక్కించుకుంటూ వచ్చాడే కానీ, అన్న పాటల జోలికిపోలేదు. రచ్చలో వానా వానా వెల్లువాయే,  అని మగధీర లో బంగారు కోడిపెట్ట అంటూ రెండు పాటలను వాడుకున్నాడు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ మాత్రం గువ్వా గోరింకతోని వాడుకున్నాడు. తర్వాత టైటిళ్లు కూడా పెట్టేస్కుంటున్నాడు. ఐతే ఇవేవీ పెద్దగా క్లిక్కవ్వలేదు. ఐతే పవన్ రేంజ్ వేరు కాబట్టి ఖచ్చితంగా అన్న పాటను ఇంకో రేంజ్ కి తీస్కెళ్తాడంటున్నారు.
Panvan Kalyan is now doing Sardhar Gabhar Singh. In this movie he is using Chiranjeevi Popular song as a remake. Already Ram Charan, and Sai Dharam remake Chiru song they both are got no popularity.