డబుల్ షాక్

8 Mar 2016                    పవన్ కల్యాణ్ ఇచ్చే షాకులు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయ్ కొన్ని అతనికే తగులుతుంటాయ్ అంటారు కూడా! ఇప్పుడు మొదటి షాక్ బాలకృష్ణ హీరోగా లయన్ అనే బీభత్సమైన మూవీ తీసిన డైరక్టర్ సత్యదేవాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రెండు ఇక సినిమాలకు గుడ్ బై చెప్పడం. మొదటి వార్తలో పెద్దగా ఆశ్చర్యపడటానికేం లేదు, ఎందుకంటే సినిమా  ఎవరు తీసినా అది నామ్ కే వాస్తే డైరక్టరే తప్ప మొత్తం మావాడే తీస్తాడని ఆయన ఫ్యాన్స్ గోల్ గప్పాలు గప్ చుప్ లు కొడుతుంటారు. ఫ్లాపైతే మాత్రం అది దర్శకుని లోపంగా చెప్తారు నమ్మండీ మాటని. అందుకే ఇప్పుడు సత్యదేవా ఇది అతని అసలు పేరో లేక ఫీల్డ్ నేమో తెలీదు కానీ పవన్ కల్యాణ్ కి ఓ కథ తయారు చేశాడట. ఒకటేమో దాసరి నారాయణరావ్ డైరక్షన్ లో వచ్చే సినిమాకి, రెండోదేమో  ఆయనే స్వయంగా పవన్ ని డైరక్ట్ చేయడానికట. 

                              ఈ రెండింటికీ పవన్ కల్యాణ్ ఓకే చెప్పాడని టాక్. రెండో షాక్ విషయానికి వస్తే పవన్ కల్యాణ్ సినిమాలు తగ్గించుకుంటూ 2019నాటికి ఇక పూర్తిగా రిటైరవడమనేది, సినిమాల తగ్గింపు హెచ్చింపు అనేది ఈ నటుడికి పెద్దగా తేడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మొదలుపెడితే ఏ రెండేళ్ల తర్వాతో రిలీజయ్యే సినిమాల చొప్పున 2019కి మహా వస్తే రెండు వస్తాయ్, అవి తీసేటప్పటికే నానా అవస్థలూ పడ్డట్లు బిల్డప్ ఇస్తుంటారు. ఇదే సంగతి ఆయన అనుపమ చోప్రా అనే హిందీ జర్నలిస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా చూస్కోవచ్చు అభిమానులు. ఒక్క సినిమా దాదాపు రెండేళ్ల తీయడం అంటే టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయిన టైమ్ లో కూడా అంటే మన తెలుగు సినిమా ఎటెళ్తుందో ఓసారి ఆలోచించుకోవాలి. ఆయనగారు అభిమానించే దాసరి ఎన్నో హిట్లు ఇచ్చింది కేవలం 28 డేస్, 40డేస్ లో తీసినవే. ఇక సూపర్ స్టార్ కృష్ణ గురించి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతీ నిర్మాతా, దర్శకుడూ గొప్పగా చెప్తున్నారంటే అది ఆయన ఫాస్ట్ నెస్, పరిశ్రమ శ్రేయస్సు కోరిన వ్యక్తి కాబట్టే. రోజుకు మూడు షిప్టులు చేసి ఓ సినిమాతో 200 కుటుంబాలను బతికించిన హీరో ఇది కృష్ణంరాజు లాంటి హీరోలే ఓపెన్ గా చెప్తుంటారు. వాళ్లకు లేని సాంకేతికత ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. ఆ లెక్కన ఇప్పుడు కనీసం ప్రతి హీరో 6 సినిమాలు చేయాలి. చేయరు అందుకే ఇప్పుడు పవన్ రిటైరవుతానన్నా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. బెట్ కాసి చెప్పొచ్చు 2019కి 3 సినిమాలకు మించి చేయలేడాయన. ఇక అలాంటిది రిటైర్మెంట్ సంగతి ఎందుకు ఇలా నిర్మాతల డబ్బును రికరింగ్ డిపాజిట్ లా వాడేబదులు. ఫాస్ట్ గా చేస్తే రిటైర్మెంట్  పదానికి అర్ధం ఉంటుంది. వారి అన్నయ్య చిరంజీవి కూడా రిటైర్ అయ్యాడు. కానీ ఇప్పుడు రీఎంట్రీ కోసం తిప్పలు పడుతున్నట్లే పవన్ కూడా 2019 తర్వాత రీఎంట్రీ అంటాడేమో రిటైరై పాలిటిక్స్ లోకి పోయి మళ్లీ రావాలనుకుంటేనే సుమా!
Pavan Kalyan and his movies are always sensational in Tollywood. Now he is doing Sardhara movie. Talk in industry is, he is going to retire form movies.