టెంట్ ఖాళీ

11 Mar 2016


                 బాబూ నువ్ స్కూల్ మూసేయ్.. ఇదీ ఇప్పుడు హైదరాబాద్ లో విన్పిస్తున్న మాట. ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేలను కొనేందుకు ట్రై చేసి అడ్డంగా బుక్కైపోయిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు టిఆర్ఎస్ కు అమ్ముడుపోయారో, లేక బ్లాక్ మెయిల్ కి లొంగిపోయారో కానీ టిడిపి టెంట్ ఇప్పుడుఖాళీ. కొత్తగా ఎవరైనా టిక్కెట్ల కోసం ఇప్పట్నుంచే ట్రై చేసుకోవచ్చు. మొత్తం 15 మంది పార్టీనుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికవగా వారిలో కాస్త హుషారున్నోళ్లంతా ముందే టిఆర్ఎస్లోకి జంపయ్యారు, మంత్రులయ్యారు. కడియం, తలసాని, తుమ్మల ఆ బ్యాచ్ లోని వారే ఇక కొన్నాళ్లు నానాయాగీ చేసి తర్వాత గప్ చిప్ గా సైలెంటైన ఎర్రబెల్లి అండ్ కో ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలయ్యారు. 

                       రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరూ మిగల్లేదు, అసలు ఈ ఆపరేషనంతా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి చేసిందైతే. ఇక మనోడి పని అసెంబ్లీలో ఐపోయినట్లే ఎందుకంటే సండ్ర వెంకటవీరయ్య ప్రధాన నిందితుడు ఓటు కు నోటు కేసులో అతగాడు కూడా టిఆర్ఎస్ లో చేరితే, కేసు కనుక విచారణ జరిగితే ముందు బుక్కయ్యేది రేవంత్ రెడ్డి, తర్వాత చంద్రబాబు మరిది జరుగుతుందా? కానీ నలుగురు ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకుని భూమి బద్దలైనట్లు బిల్డప్ ఇచ్చిన టిడిపి నేతలు ఇప్పుడు హైదరాబాద్ కి వస్తే కనీసం వాళ్లని పలకరించేందుకు కూడా పార్టీ ప్రతినిధులు లేని స్థితిని సిటీలో ఎదుర్కొంటారు. సిగ్గులేకుండా పార్టీలు మారిన వీళ్లంతా నిజంగా రాజీనామాలు చేయగలరా. అందుకు కనీసం చంద్రబాబు కూడా డిమాండ్ చేయకపోవడం చాలా అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా బాబుకు తెలిసే జరుగుతుందా లేకపోతే ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో ఎవరికీ తెలీదు పాపం వాళ్ల కార్యకర్తలు అభిమానులు మాత్రం ఫేస్ బుక్ లో  తెగ రోషాలు వేషాలు వేస్తున్నారు.
In Telangana TDP MLAs are five members only. Shortly it will be 3, two of the MLAs contacted KCR. Now KCR targeting Revanth Reddy.