ప్రభాస్ ఫ్యామిలీకి అప్పులా?

17 Mar 2016


                              హీరో ప్రభాస్ తమ్ముడు ప్రభోద్ కి ఏడాది జైలు శిక్ష విధిస్తూ రాజేంద్రనగర్ కోర్టు తీర్పిచ్చింది. ఇది అమలయ్యేదీ, లేనిదీ బెయిల్ తో బైటికి వచ్చేదీ తర్వాత సంగతి. ఇప్పుడు ఈ తీర్పుతో ప్రబాస్ ఫ్యామిలీకి కూడా  అప్పులున్నాయనే సంగతి తెలిసివచ్చింది. ఏడేళ్ల క్రితం వచ్చిన బిల్లా అనే సినిమా ప్రొడక్షన్ కి ప్రభోద్ కూడా సహనిర్మాతగా వ్యవహరించాట్ట. ఆ టైమ్ లో హైదరాబాద్ లోని ఓ బిజినెస్ మాన్ దగ్గర 43 లక్షలు అప్పు తీసుకుని ఎగ్గొట్టడంతో ఆ కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

                        అప్పుడెప్పుడో తీసుకున్న డబ్బు చెల్లించకపోగా, వాయిదాలు వేస్తుండటంతో ఓ ఫైన్ మాణింగ్ మనోడు ఓ చెక్ ఇచ్చాడట మరిన్నాళ్లు ఏం చేసాడో తెలీదుకానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో రాజేంద్రనగర్ కోర్టులో కేసు వేశాడు సదరు వ్యాపారి. దీంతో వెంటనే కోర్టు ప్రబోధ్ కి సంవత్సరం జైలుశిక్షతోపాటు, 60రోజుల్లోగా అప్పు తీర్చాలని తీర్పిచ్చింది. బిల్లా సినిమా బంపర్ హిట్ కాకపోయినా అట్టర్ ప్లాప్ మాత్రం కాదు. ఐనా మనోడు అప్పు ఎగ్గొట్టే ప్లానేసాడంటే, ఇది ఖచ్చితంగా ప్రభాస్ ప్యామిలీకి ఓ మచ్చఅనే చెప్పాలి. అందులో ఇప్పుడు బాహుబలి రేంజ్ పెరిగిన తర్వాత కూడా అప్పులంటే ఇక మరి చూసేవాళ్లకి ఈ న్యూస్ షాక్ లానే ఉంటుంది.
In Rajendra Nagar court Tollywood hero Prabash Prabodh was prisoner  to one year. He has debuts for the movie Billa released.