నో కాన్ఫిడెన్స్

14 Mar 2016


                           ఏపీ అసెంబ్లీలో హై డ్రామా నెలకొంది, అవిశ్వాస తీర్మానానికి అనుమతిచ్చిన స్పీకర్ అక్కడ కూడా తెలివితేటలు ప్రదర్శించారనే ఆరోపణలు వచ్చాయ్. ఇవాళ బిఏసీలో అవిశ్వాస తీర్మానంపై డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పి, ఇవాళే చర్చకు ఆహ్వానించడంపై విమర్శలున్నాయ్. విప్ జారీ చేయకుండానే ఇలా చేసినట్లు వైసీపీ చెప్తోంది, ఐతే ఈ మెయిల్ ఎస్ఎంఎస్ లు ద్వారా విప్ చెల్లుతుందని అంటున్నారు. దానికి తోడు సభలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వెళ్లామని చెప్పిన ఎమ్మెల్యేలు కన్పించకుండా పోవడం పిచ్చ కామెడీగా మారింది. ఇదే అంశాన్ని వైఎస్ జగన్ నిండుసభలో ఛాలెంజ్ చేసి మరీ చెప్పారు. 

                             ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇలాంటి అవిశ్వాసాలు ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలేదని కూడా అంటున్నారు. పైగా నోటీసు ఎలా ఇవ్వాలో తెలీదంటూ హేళన చేయడం, ప్రభుత్వం అహంకారానికి నిదర్శనంగా విశ్లేషకులు చెప్తున్నారు. అవిశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. దీనికి ప్రతిగా టిడిపి ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు ఈ నోకాన్ఫిడెన్స్ అంటూ మాట్లాడారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సభలో ప్రభుత్వాన్ని పడగొట్టే సంఖ్య లేదు, అంత మాత్రాన సభలో అసలు అవిశ్వాస తీర్మానమే పెట్టకూడదన్నట్లు మాట్లాడటం టిడిపి సభ్యుల అవివేకానికి నిదర్శనం. సభలో అధికారపక్షం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలకు తెలియజెప్పడానికి అదో మార్గం. ఇంకో ప్రబుద్దుడు బడ్జెట్ పై చర్చ లేకుండా, అవిశ్వాసంపై చర్చ ఏంటని అడిగాడు. ఐతే అలా చేసింది టిడిపినే అని తెలియకపోవడం అతగాడి సెల్ఫ్ గోల్ కి మంచి ఉదాహరణ. పార్టీ నుంచి జంపైన ఎమ్మెల్యేలపై వేటు పడేందుకు, అలా చేసేందుకే ఈ నోకాన్ఫిడెన్స్ ను తెచ్చారని తెలిసి దాన్ని తప్పించుకోవడానికే వైఎస్ జగన్ ఇలా వ్యవహరించారు. ఐతే టిడిపి మాత్రం తన దిగజారుడుతనాన్ని ఓపెన్ గా సభలోనే ప్రదర్శించారు. తన పంచన జేరిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సభలో లేకుండా చేసిన గొప్పదనం ఆ పార్టీకే దక్కుతుంది.
In AP assembly YSRCP introduced no confident motion. But TDP leaders are showing over knowledge about this motion, asking foolish questions.